ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం.. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు.…
అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ.బి.సి మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీనర్గాలు, దళితులు, ఆదివాసుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా మోది చేస్తున్న…
వికసిత్ భారత్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్రం ఈరోజు విడుదల చేశామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజల ముందు మేనిఫెస్టోను పెట్టామని, దేశ కళ్యాణం, దేశ హితం కోసం మేము మేనిఫెస్టో ప్రవేశ పెట్టామన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులకు సంబంధించిన ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో పెట్టామని, ముఖ్యంగా ఈ నాలుగు అంశాలపైనా రాబోయే ఐదేళ్లు పని చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్ల…
సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈనెల 18న సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొననున్నారు రాజ్నాథ్ సింగ్. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్…
దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని ఆయన వెల్లడించారు.
గత ప్రభుత్వంలో దుశ్శాసన పాత్ర పోషించిన ఎంఐఎం ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పంచన చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం అని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ కి చీకటి దందాలకు అండా కావాలి, బీజేపీ ఓడి పోవాలన్నారు కిషన్ రెడ్డి.…
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో మభ్య పెట్టిందని, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం అన్నాడు కానీ అయ్యనొక్కడే ఇల్లు కట్టుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇళ్లు ఇస్తామంది కానీ ఇంకా జరగలేదన్నారు. భారతీయ ఆత్మ దేవాలయాలని, ఆదర్శ వ్యక్తి రాముడు.. ఇప్పుడు ఆయనకు గుడిని నిర్మించుకున్నామన్నారు కిషన్ రెడ్డి. రామ భక్తుడిగా మోడీ రాముడి దేవాలయాన్ని నిర్మించారని, ఇప్పుడు 302 సీట్లు ఉన్నాయి.. ఈ…