ఈ ఎన్నికలు తెలంగాణకో.. సికింద్రాబాద్ కో సంబంధించినవి కావు.. దేశం కోసం జరిగే ఎన్నికలు ఇవి అని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ పైన గల్లీ టూ గల్లీ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లు ఈ రోజు తెలంగాణలో అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగువారమంతా ఏ పని చేసినా పంచాగం చూస్తుంటామని, అలాంటి పంచాంగ పఠనం జరిగే ఈ రోజు మనకు ఎంతో శుభసూచమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్,…
డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక అని, పెద్దగా సభలు పెట్టాలని అనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపీ గెలవాలి.. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను అభ్యర్ధిగా ఉన్నాను సో అందరిని కో ఆర్డినేట్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యల్లో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు.…
ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'ఉగాది సంబరం' పేరుతో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు పాల్గొన్నారు.
జూన్ 8 లేదా 9న మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఓటెయ్యండి.. అభివృద్ధి కోసం ఓటెయ్యండి అంటూ ప్రజలకు ఆయన సూచించారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది.? ఆలోచించాలన్నారు.
చేతకాక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్షించారు. తన పార్టీ ప్రభుత్వం ఏమీ చేసిందో తెలియని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గ్యారెంటీల అమలుపై చర్చకు సిద్దమా అంటూ బహిరంగంగా సవాల్ చేశారు.
BJP Tiffin Box Baithaks: నేడు బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో టిఫిన్ బాక్స్ బైఠక్లు నిర్వహించనుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్రెడ్డితో పాటు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు తమ తమ పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్ల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కాగా, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలోని పోలింగ్…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుకోలేదని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీకి…
Kishan Reddy: మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్నా ఆయన ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది.