మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు. దాంతో నేడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు అధికారులు.
ఈ నేపథ్యంలో సోమవారం నుండి యధావిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మళ్లీ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఇక సోమవారం నాడు కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్ర మొదలు కాబోతోంది. అక్కడ నుంచి యాత్ర గన్నవరం, ఆత్కూర్, వీరపల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వరకు కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం జొన్నపాడులో భోజన విరామం తర్వాత సాయంత్రంకి జనార్దనపురం మీదుగా గుడివాడకు ఆయన చేరుకుంటారు. నగవరప్పాడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రేపు ఆయన పాల్గొనబోతున్నారు.
2026 ఎన్నికలే టార్గెట్గా రాజకీయాల్లోకి స్టార్ హీరో విశాల్..!
తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్ తాజాగా సంచలన విషయాన్ని తెలిపారు. అతి త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆయన స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీ సంబంధించి విశాల్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగానే తాను 2026లో తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని.. అతి త్వరలోనే తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటూ తెలిపారు. పొలిటికల్ ఎంట్రీలో భాగంగా తాను కూడా ఓ పార్టీని స్థాపిస్తామని తెలియజేశారు. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్ చెన్నై వేదికన ఈ విషయాలను తెలిపాడు. రాష్ట్రంలోని ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని.. వారికోసం తాను అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతోనే ఇలా రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ లాగానే.. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను పచ్చిగా మోసం చేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటింది.. ఐదో నెలలో ఉన్నామని, ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాలపై క్లారిటీ లేదు.. బడ్జెట్ లేదు.. చేద్దామన్న నియత్ కూడా లేదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లాగానే.. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను పచ్చిగా మోసం చేసిందన్నారు. రేవంత్ వడ్లు ఎవరూ అమ్మవద్దు.. తాను వచ్చాక డిసెంబర్ 9వ తేదీన 500 బోనస్ ఇచ్చి కొంటామని చెప్పారన్నారు. డిసెంబర్ 9 ఇంకా రాలేదన్నారు ఎంపీ అర్వింద్. 2 లక్షల రుణమాఫీ ఎవరైనా అడిగారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే పెట్టారని, రేవంత్ వరి కూడా సమయానికి కొంటలేడన్నారు.
అంతేకాకుండా..’కాంగ్రెస్ దిగజారిన రాజకీయాలు చేయడం వల్ల క్యాండిడేట్స్ కూడా దొరకట్లేదు. పనికిమాలిన క్యాండిడేట్ లకు టికెట్లు ఇస్తున్నారు. సీరియస్ అండ్ సీనియర్ కాంగ్రెస్ మెన్ కు రాహుల్ పై అంత భరోసా ఉంది అంటూ సెటైర్లు. కాంగ్రెస్ కు మొత్తం 30 సీట్లు కూడా దాటవు. ట్యాపింగ్ విషయంలో తప్పు చేస్తే జైల్లో వేయి.. అంతేకాని రోజూ అదే అంశంపై ఎందుకు మాట్లాడటం. ప్రజా సమస్యలపై కాకుండా ఇదే అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఆప్ కీ అదాలత్ ను నేను రెండు దశాబ్దాలుగా చూస్తున్నా.. రేవంత్ ది.. కామెడీ షో లాగా అనిపించింది. పొద్దున ఒక ల్యాండ్ గురించి మాట్లాడి.. సాయంత్రం సెటిల్ మెంట్ చేసుకోవడమే.
ఎవరెన్ని కుట్రలు చేసినా మోడీపై ప్రజల దృష్టి మరల్చలేరు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టీవీ సీరియల్ లా సాగుతుందని, అసలైన నేరస్థులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే.. ఇప్పుడు కాంగ్రెస్ లో బట్టి, ఉత్తం ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, లై డిటెక్టర్ కి మేము సిద్ధం మరి రేవంత్ రెడ్డి సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసురుతున్నాడన్నారు. కానీ రేవంత్ స్పందించడం లేదన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమా అని కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడని, అప్పుడు కేటీఆర్ కూడా స్పందించ లేదని లక్ష్మణ్ అన్నారు. కేవలం బీజేపీ దృష్టి మరల్చేందుకు ఒకరిపై ఒకరు సవాల్ చేసుకుంటున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా మోది పై ప్రజల దృష్టి మరల్చలేరని ఆయన ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున లై డిటెక్టర్లను డీఎన్ఏ టెస్ట్ లను మేము ఏర్పాటు చేస్తామని, నిజంగా చిత్త శుద్ది ఉంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ రావాలన్నారు ఎంపీ లక్ష్మణ్.
రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఒకే స్ట్రోక్‌తో దేశంతో పేదరికాన్ని నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం స్పందించిన ప్రధాని మోడీ.. ఆయనను ‘‘రాజ మాంత్రికుడు’’ అని ఎద్దేవా చేశారు. దేశం రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియాలో ఆదివారం ప్రధాని మోడీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. వారు దేశాన్ని రక్షించలేరని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం ఆయనను గౌరవించిందని మోడీ చెప్పారు. ‘‘ఒకే దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తానని కాంగ్రెస్ షెహజాదా చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ రాజమాంత్రికుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు..? అతని నానమ్మ(ఇందిరాగాంధీ) 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు’’ అని రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ విమర్శించారు. 2014కి ముందు పదేళ్లు రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపించారని, ఇప్పుడు మాత్రం మంత్రదండం దొరికిందా..? అని ప్రశ్నించారు. సీపీఎం మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, పార్టీ పేరు చెప్పకుండా ఇండియా కూటమిలోని ఓ పార్టీ అణు నిరాయుధీకరణకు పిలుపునిచ్చిందని అన్నారు. బలపడలేని పార్టీ దేశాన్ని బలోపేతం చేస్తుందా..? అని మోడీ ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే.. వైసీపీపై తీవ్ర విమర్శనాస్త్రాలు
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికారయాత్రలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయని దుయ్యబట్టారు. మాట తప్పను అంటూ జగన్ ఈ రాష్ట్రానికి మెడలు విరిచేసాడు.. దళితులకు అండగా ఉంటాను అని దళితులను హత్య చేస్తున్నావని సీఎం జగన్ పై మండిపడ్డారు. అక్క, చెల్లెమ్మలు అంటూ ఆస్తిలో హక్కులు అడుగుతున్నావు.. ఇసుక అమ్ముకొని ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నావని ప్రశ్నించారు. జే బ్రాండ్ పేరుతో అక్క చెల్లెమ్మల తాళిబొట్లు తెంపుతున్నావని వ్యాఖ్యానించారు.
దళితులపై సీఎం రేవంత్ రెడ్డి వివక్ష చూపించారు
దళితులపై సీఎం రేవంత్ రెడ్డి వివక్ష చూపించారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ ను సీఎం అవమానించారని, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ విషయం పై దళిత సంఘాలు స్పందించాలని, భట్టి విక్రమార్క కు కనీస బాధ్యత లేదా..దీనిపై ఆయన ఏమి చెబుతారన్నారు బాల్క సుమన్. కేబినెట్ లో ఉన్న దళిత మంత్రులు ఎందుకు నోరు తెరవడం లేదని, దళిత జాతి రేవంత్ రెడ్డి ని క్షమించదన్నారు. దళితులకు న్యాయం చేసింది బీఆర్‌ఎస్ పార్టీ నే అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మాటలన్నీ బూటకమేనని, వారికి లొంగని వారిపైకి ఈడీ ని పంపుతుందన్నారు.
కేసీఆర్ కట్టిన సచివాలయంలో రేవంత్ ఎలా కూర్చుంటున్నడని.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చెరిపేస్తామని రేవంత్ అన్నారని.. కాళేశ్వరం నీళ్లను రైతులకు అందకుండా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. భేషరతుగా రేవంత్ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. సీఎం ఫ్యూడల్‌మైండ్ సెట్‌తో ఉన్నారని.. డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు.
ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న వరల్డ్ వార్-3
ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న ఇజ్రాయిల్, సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసి ఆ దేశానికి చెందిన ఇద్దరు కీలక సైనిక జనరల్స్‌తో పాటు ఏడుగురు సైనిక అధికారులను హతమార్చింది. అయితే, ఈ ఘటన తర్వాత నుంచి ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్స్(ట్విట్టర్)లో ‘‘వరల్డ్ వార్-3’’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ 51 వేల కన్నా ఎక్కువ పోస్టుల రాగా, నెటిజన్లు ఇరాన్, ఇజ్రాయిల్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇరాన్‌కి మద్దతుగా చైనా, రష్యా, ఉత్తర కొరియా ఉంటాయని, ఇజ్రాయిల్‌కి మద్దతుగా నాటో, అమెరికా, యూకేల కూటములుగా ఏర్పడుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు తమకు నచ్చినట్లుగా ఈ రెండు దేశాలకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు.
కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతాం
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 16న మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ సభ నిర్వహించే సభ స్థలిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలు గుర్తు వచ్చేలా రైతులు, యువకులు, మహిళలు, గొల్ల కురుమలు రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలన్నారు హరీష్ రావు.