కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ హామీలు అని ఆయన విమర్శించారు. సర్పంచ్‌లకు నేరుగా నిధులు ఆల్రెడీ వస్తున్నాయని, పీఎం సూర్య ఘర్ సోలార్ విద్యుత్ యోజన.. ఇప్పటికే కేంద్రం ప్రారంభించిందన్నారు కిషన్ రెడ్డి. సంగీత నాటక అకాడమీ కి ఫౌండేషన్ , ఘంటశాల కళమండపం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది.. శంఖుస్థాపన కూడా అయిందని, రైల్వే మానుఫాక్చరింగ్ యూనిట్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టర్ ఫీజిబిలిటీ కాదని రిపోర్ట్ లు వచ్చాయి… ఇది ప్రజలకి, రామగుండం మణుగూరు రైల్వే సంబందించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రేవంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ వేస్తున్న అని, 2017 లోనే సైనిక స్కూల్ మంజూరు అయి ఉంది … కేసీఆర్ సర్కార్ సహకరించలేదన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. నవోదయ ఫైల్ కేబినెట్ లో అప్రూవ్ అయింది. నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ అట… ఇప్పటికే సివిల్ ఏవియేషన్ రీసర్చ్ ఆర్గనైజేషన్ ను హైద్రాబాద్ లో మోడీ ప్రారంభించారు. ప్రజలు నవ్వుకుంటారు, అసహ్యించుకుంటారు అనే సిగ్గు లేదు. హైదరాబాద్ లో బోర్డు లు పెట్టుకుంటున్నారు… తెలంగాణ లో ఏ మార్పు మొదలు అయింది. కేసీఆర్ కుటుంబ పాలన పోటీ సోనియా కుటుంబ పాలన వచ్చింది.. హామీలు ఇచ్చి గాడిద గుడ్డు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక నియామక పరీక్షలు పెట్టీ ఉద్యోగాలు ఇచ్చిందా.. .గత ప్రభుత్వం లో జరిగిన పరీక్షలకు ఈ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చింది. తెలంగాణ లో రేషన్ కార్డు కు ఇస్తున్నారా. సింగరేణి కార్మికులకు కోటి భీమా కల్పించారా. ఒక్క మహిళ సంఘానికి అయిన వడ్డీ లేని రుణం ఇచ్చారా. ఇవన్నీ హోర్డింగ్ లు పెట్టుకున్నారు.. ధర్నా చౌక్ హై కోర్టు తీర్పు ఇచ్చింది . రేవంత్ రెడ్డి పునరుదరించేది ఏంది… ఎన్నికలకు ముందే brs కాడి పడేసింది… చేతులు ఎత్తేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటే కరప్షన్, మోసం. గ్యారంటీ ల పేరుతో గాడిద గుడ్డు ఇచ్చారు… చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు గుర్తు పెట్టుకునరేమోనని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.