ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కిషన్రెడ్డి తన నివాసాన్ని పల్లెటూరు మాదిరిగా అందంగా అలంకరించారు. కార్యక్రమానికి హజరైన ప్రధానికి ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య మోడీ వేడుక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మోడీ తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పిరికిపిందల చర్య.. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నానని అన్నారు.
Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వమని, రైతు భరోసా లో కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎందరు ప్రభుత్వం దగ్గర డేటా ఉందని,…
Kishan Reddy : నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, బీజేపీకి మీరు అందించిన మద్దతు వల్ల మోదీ…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు.. కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనమని విమర్శించారు.
నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ…
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారతీయ సాహసయోధులైన సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్లకు ఘన నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.
Kishan Reddy : నమ్మిన సిద్ధాంతం కోసం వాజపేయి ఎక్కడ రాజీ పడలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాజపేయి విదేశాంగ మంత్రి అయ్యేవరకు.. పాస్ పోర్ట్ రావాలంటే రెండు మూడేళ్లు పట్టేదన్నారు. ఐక్యరాజ్య సభలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజపేయి అని ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల్లో భారత దేశాన్ని కించ పరిచే విధంగా అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, రాజ్యాంగ…
ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపి సభ్యులు సుధాన్ష్ త్రివేది హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు! పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న…