Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను విద్యాపరంగా అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకే రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా 9 శాతం నిధులను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఓట్ల రాజకీయం కోసం కాకుండా, పిల్లల బంగారు భవిష్యత్తును దిద్ది తీర్చాలనే ఏకైక లక్ష్యంతోనే విద్యాశాఖ బాధ్యతలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. గతంలో ఉన్నవారు ఇరిగేషన్ శాఖను ఎంచుకుంటే, నేను విద్యాశాఖ బాధ్యతను నా వద్దే ఉంచుకున్నా. 80 వేల పుస్తకాలు చదివానన్న నాయకుడి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కానీ నా ప్రాధాన్యత ప్రాజెక్టులు కావు, పిల్లల చదువులే అని సీఎం అన్నారు. లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నా, ఉద్యోగానికి దరఖాస్తు రాసుకోలేని పరిస్థితి రాకూడదని, విద్యా ప్రమాణాలను పెంచడమే తమ నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు.
చిన్నతనంలోనే పిల్లలను హాస్టళ్లలో వేయడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒంటరిగా పెరిగే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే ప్రమాదం ఉందన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులే తల్లిదండ్రుల స్థానంలో ఉండి పిల్లలకు సరైన మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయంగా, ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని విద్యా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు.
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ..
విద్యాబోధనలో అంతర్జాతీయ ప్రమాణాలు అందించేందుకు ఏటా 10 నుండి 12 మంది ఉపాధ్యాయులను ‘స్టడీ లీవ్’పై విదేశాలకు పంపిస్తామని ప్రకటించారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల బాధ్యతను తానే చూసుకుంటానని, అడగకుండానే ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామని గుర్తుచేశారు. ఇదే క్రమంలో తన రాజకీయ ప్రస్థానంపై స్పందిస్తూ “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే సీఎంగా ఉంటాను, ఎలాంటి సందేహాలు వద్దు” అని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!