Kishan Reddy : రోజ్గారి మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజ్ గార్ మేళాలు పూర్తి అయ్యాయి… ఇది 11 వ మేళా అని ఆయన అన్నారు. ఈ రోజుతో (ఈ 11 మేళాలో) కలుపుకొని సుమారుగా పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు కిషన్ రెడ్డి. ప్రతి నెల ఉద్యోగ నియామకాలు…
మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఈనెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఈటల తెలిపారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వేస్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి.. నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుందని అన్నారు.
Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని…
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా.. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని, భారత్ భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యంతో గొప్పదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని, మన దేశంలో 121 భాషలు ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం భాషలలో గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో 14…
Kishan Reddy : సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్లో జేసిఐ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 100 కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని, గత కొన్నేండ్ల క్రితం నేను అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్ సెంటర్లు.. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్…
Kishan Reddy : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో మహా కుంభమేళా ఒకటి. ఈసారి కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలో జరగనుంది. ఈ గొప్ప కార్యక్రమం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర నదుల్లో వందలాది సంవత్సరాలుగా…
Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ పైర్ అయ్యారు. హైదరాబాద్ నగరానికి ఏం చేశారు అదే సరూర్ నగర్ సభలో చెప్పాలని సవాల్ విసిరారు.
Ponnam Prabhakar: సమగ్ర కుల సర్వేలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు పాల్గొనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు.