Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajinkya Rahane Retirement: టీమిండియా సీనియర్ క్రికెటర్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రహానే గురువారం ఉదయం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తాను ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ఆడనని జింక్స్ ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. రహానే వీడ్కోలుతో భారత క్రికెట్లో ఓ స్వర్ణ అధ్యాయానికి ముగింపు పలికినట్లైంది.
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తన నాయకత్వంలో టీమిండియాకు అందించాడు. అడిలైడ్ టెస్టులో భారత్ చారిత్రాత్మకంగా 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత.. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లగా రహానే జట్టు బాధ్యతలు చేపట్టాడు. గాయాలతో సతమతమవుతున్న యువ జట్టును సమర్థంగా నడిపించాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించి.. ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
Also Read
- Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
- Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..
- Virat Kohli vs Pakistan: భారత్ - పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
- Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 8,000కు పైగా పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో 5,077 పరుగులు, 12 సెంచరీలు నమోదు చేశాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఆడిన ఇన్నింగ్స్‌లు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాయి. విదేశాల్లో అత్యంత నమ్మకమైన భారత బ్యాటర్లలో రహానే ఒకడిగా గుర్తింపు పొందాడు. రహానే 2015 వన్డే ప్రపంచ కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 భారత జట్టులో ఉన్నాడు. వెస్టిండీస్‌తో 2023 జూలైలో ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్టే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్.
తన సుదీర్ఘ కెరీర్లో అజింక్య రహానే ప్రశాంత స్వభావం, జట్టుకు అంకితభావం, ఒత్తిడి సమయంలో బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో సాధించిన చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం అతడిని భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానేకు అభిమానులు, మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతూ అతని సేవలను కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!