Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumanth: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా “న్యూటన్స్ థర్డ్ లా” (Newton’s 3rd Law). ఈ చిత్రం రేపు (జులై 31న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో హీరో సుమంత్ తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలని ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నానని, ముఖ్యంగా ఓ బలమైన విలన్ పాత్ర చేయాలన్న కోరిక ఇప్పటికీ తీరలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని రకాల పాత్రలు చేయాలనే ఆలోచనతోనే ఉన్నానని చెప్పారు. హీరో పాత్రలతో పాటు మంచి సపోర్టింగ్ రోల్స్, బలమైన ప్రతినాయక పాత్రలు చేయాలన్న ఆసక్తి తనలో ఎప్పటి నుంచో ఉందన్నారు.
“చిన్నప్పటి నుంచే ఒక మంచి విలన్ పాత్ర చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ అలాంటి అవకాశం రాలేదు. నేను ఎప్పుడూ ఆ కోరిక గురించి చెబుతూనే ఉన్నా… కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు” అంటూ నవ్వుతూ అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ.. “చాలామంది నన్ను ఇప్పటికీ ‘గోదావరి’ సినిమాలోని శ్రీరామచంద్రుడి తరహా ఇమేజ్‌తోనే చూస్తున్నారు. కానీ నేను అలాంటి పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదు. ఈ సినిమాలో కూడా ప్రేక్షకులకు నా మరో కోణం కనిపిస్తుంది” అని తెలిపారు. ‘సీతారామం’ సినిమా తర్వాత తనకు కొన్ని సపోర్టింగ్ పాత్రలు వచ్చినప్పటికీ, తనను నిజంగా ఆకట్టుకునే పాత్రలు మాత్రం ఇంకా రాలేదని సుమంత్ వెల్లడించారు. ఆశ్చర్యకరంగా ఇప్పటికీ తనకు ఎక్కువగా హీరో పాత్రల ఆఫర్లే వస్తున్నాయని చెప్పారు. “ప్రస్తుతం కూడా నాకు హీరో పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ లీడ్ రోల్స్ చేస్తూనే కథకు బలం చేకూర్చే సపోర్టింగ్ రోల్స్, బలమైన విలన్ క్యారెక్టర్లు చేయాలని ఉంది. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను” అని సుమంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సుమంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!