Kishan Reddy : కార్మికుల కోసం , బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని, బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా సేవలు అందించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని, గత ఏడాది అయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న బిరుదు ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ నియంతృత్వ…
Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(State office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు.. కాషాయ పార్టీలో చేరిన ఖైరతాబాద్కు చెందిన పలువురికి పార్టీ కండువా కప్పి.. ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పనులు…
Kishan Reddy : బీజేపీలో తరవాత అధ్యక్షుడు ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పగలరా.. బీఆర్ఎస్ నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతాయి…. బీజేపీలో అలా కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మండల అధ్యక్షులలో 50 శాతం పైగా బీసీ లు ఉన్నారని, సంస్థాగత…
Kishan Reddy: భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని, ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని పెంపొందించడానికి బీజేపీ చేపట్టిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం హైదరాబాద్ నగర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ఇది ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించే గొప్ప పత్రిక అని పేర్కొన్నారు. అనేక దేశాలకు భారత…
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్…
జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. సాక్షాత్ ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ పర్యటనకు బయలు దేరారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో పాల్గొననున్నారు. 'టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్' థీమ్తో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతుంది.
పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపింది.