NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK111: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం NBK111. బాలయ్య కెరీర్లో ఇది 111వ సినిమా. బ్లాక్‌బస్టర్ సినిమా ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఆయన – డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవ చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాకినాడ పోర్ట్ సమీపంలో ఈ సినిమా షూటింగ్లో భాగంగా బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సర్జరీ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం బాలయ్య ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ 1 నుంచి తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తికాగా, మిగిలిన షూటింగ్‌ను ఎలాంటి విరామం లేకుండా వరుస షెడ్యూళ్లలో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి టాకీ పార్ట్‌తో పాటు మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో బాలయ్య అండ్ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
మేకర్స్ ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ 30, 2026న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే బాలయ్యకు సినిమా షూటింగ్లో ఊహించని ప్రమాదం జరగడంతో ప్రస్తుతం మేకర్స్ షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య మళ్లీ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు తెలియడంతో అనుకున్న డేట్‌కే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదంటే పోస్ట్ పోన్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. కొత్త రిలీజ్ ప్లాన్‌పై ఓటీటీ పార్ట్నర్తో చర్చించిన అనంతరం ఫైనల్ విడుదల తేదీని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్లో బాలయ్య పాల్గొంటున్నట్లు వార్తలు బయటికి రావడంతో ఆయన ఫ్యాన్స్ బాలయ్య మొండితనానికి ఫిదా అవుతున్నారు. సర్జరీ అయినా బాలయ్య తగ్గేదేలే అంటున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ గెట్ వెల్ సూన్ బాలయ్యా అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు.
Also Read
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
- Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
తాజావార్తలు
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!