Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం రేపింది. మానవ అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఒక మహిళ మృతి చెందడం, పలువురు వైద్యులు, ముఠా సభ్యులు అరెస్టు కావడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలను పద్మ అనే మహిళ మదనపల్లికి తీసుకొచ్చింది. వీరిపై గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆ ఆపరేషన్‌లో యమున అనే మహిళ పరిస్థితి విషమించి మరణించింది. దీనితో యమున…
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్‌నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
Kidney Racket Case: హైదరాబాద్ మహానగరంలోని అలకనంద హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకీ ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నీ రాకెట్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు కేసుకు సంబంధించి కిడ్నీలు ఇచ్చినవారు, కిడ్నీలు తీసుకున్నవారు లభించగా హాస్పిటల్ ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత కిడ్నీ…
Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. Also Read:…
అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ వార్తపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం చేసింది. బాధ్యులైన వైద్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడిపై తెలంగాణ వైద్య మండలి స్పందించి సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) ప్రకటించింది.
హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. దీంతో.. కమిటీ గాంధీ ఆసుపత్రికి రానుంది. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం.
Kidney Racket: హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై పోలీసులు తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకున్న అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పాల్గొన్న వైద్యుల కోసం కూడా విచారిస్తున్నారు. ఈ దందా ఎంతకాలంగా కొనసాగుతుందో? ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారో అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ నిర్వాహకుడు సంపత్‌తో పాటు మరికొంత మంది…
Kidney Scandal : బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది.