Kidney Racket: కిడ్నీ రాకెట్ వ్యవహారం.. గ్లోబల్ ఆస్పత్రి సీజ్, పలువురి అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం రేపింది. మానవ అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఒక మహిళ మృతి చెందడం, పలువురు వైద్యులు, ముఠా సభ్యులు అరెస్టు కావడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలను పద్మ అనే మహిళ మదనపల్లికి తీసుకొచ్చింది. వీరిపై గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆ ఆపరేషన్‌లో యమున అనే మహిళ పరిస్థితి విషమించి మరణించింది. దీనితో యమున కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మదనపల్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాంతో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Sandeep Chakravarthi: సెల్యూట్..! ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఈ తెలుగు అధికారి పాత్ర కీలకం..
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
పోలీసులు దర్యాప్తు చేపట్టి.. కిడ్నీ రాకెట్ ముఠాలో కీలక నిందితుడిగా నీరజ్ అనే వ్యక్తిని గుర్తించారు. అంతేకాకుండా ఈ ముఠాతో కలిసి పనిచేస్తున్న గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ రాకెట్‌కు సహకరిస్తున్న పద్మ అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ రాకెట్ బహిర్గతం కావడంతో మదనపల్లిలోని గ్లోబల్ హాస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో హాస్పిటల్ యజమాని డా. ఆంజనేయులు, మరో వైద్యుడు, అలాగే విశాఖకు చెందిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య లపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు.
Investments in Amaravati: రూ.50,000 కోట్ల లక్ష్యం.. పలు రంగాల్లో భారీ పెట్టుబడులు..!
ముఠా సభ్యుల మధ్య డబ్బు పంచుకునే విషయంలో తిరుపతిలో గొడవలు తలెత్తడంతో విషయం బయటపడింది. ఒకరికొకరు ఘర్షణకు దిగడంతో పోలీసుల దృష్టికి ఈ వ్యవహారం వచ్చింది. దీని ఫలితంగా మొత్తం కిడ్నీ రాకెట్ నెట్‌వర్క్ బి బయట అయ్యింది. అంతేకాకుండా పోలీసులు ల్యాబ్ టెక్నీషియన్లపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
ట్రెండింగ్
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!