కిడ్నీ రాకెట్ కేసులో వాస్తవాలు వెలుగు వస్తున్నాయి. దీంతో.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తుంది. కిడ్నీ మార్పిడి కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కీలక పాత్ర పోషించింది. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద పది లక్షలు వసులు చేసి.. డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించింది. మొత్తం రూ. 27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో.. మోసపోయామని తెలుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Kidney Racket: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి యువకుల కిడ్నీలను కంత్రీగాళ్లు కొట్టేస్తున్నారు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి అవి సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్నీఇన్నీ కావు.
విశాఖ తీరంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్లను టార్గెట్ చేసిన గ్యాంగ్.. డబ్బు ఆశచూపి అమాయకుల కిడ్నీ తీసుకుని మోసం చేస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి.