ఆపరేషన్ సిందూర్‌తో హడలెత్తిపోయిన పాకిస్థాన్.. అమెరికా ద్వారా తీవ్ర లాబీయింగ్‌కు పాల్పడింది. అంతేకాకుండా ప్రస్తుతానికి సైనిక చర్య ఆపేసినా.. భవిష్యత్‌లో మళ్లీ ఆపరేషన్ సిందూర్ చేపట్టొ్చ్చని భయాందోళన వ్యక్తం చేసింది. అలాంటిది ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోంది.
తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేలా వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా తమ జెట్‌లు అమ్ముడైపోతున్నాయని.. ఇకపై తమకు ఐఎంఎఫ్ రుణం అవసరం లేదని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ యుద్ధ విమానాల కోసం రికార్డ్ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమకు 6 నెలల తర్వాత ఐఎంఎఫ్ ఆర్థిక సహాయం అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంతో నాలుగు రోజుల చిన్న యుద్ధం జరిగిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
మంగళవారం కరాచీకి చెందిన జియో టీవీతో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మే 2025లో భారతదేశంతో నాలుగు రోజుల మినీ యుద్ధం తర్వాత పాకిస్థాన్‌కు రక్షణ ఆర్డర్లు పెరిగాయన్నారు. ఆరు నెలల తర్వాత పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి రుణాలను వదులుకుంటుందని తెలిపారు. మే నెలలో భారత్‌తో మినీ యుద్ధాన్ని తట్టుకునే సామర్థ్యం పాకిస్థాన్‌కు ఉండటం వల్ల సైనిక హార్డ్‌వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. మా విమానాలను పరీక్షించారని.. బాగుండడంతో చాలా ఆర్డర్లు వస్తున్నట్లు వెల్లడించారు. అంతే పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను ప్రపంచం గుర్తించిందని గొప్పలు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు బలపడుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.