టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓ పాము కలకలం సృష్టించింది. అయితే.. ఆ పామును స్వయంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్టుకుని బయట పడేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాము చోరబడింది. ఆ కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించే గదిలోకి పాము చొరబడింది. దీంతో ఆ సమయంలో అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ ఆందోళన చెందారు. అయితే… అక్కడే ఉన్న ఖమ్మం టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఇటీవలనే నియమితులైన పగడాల నాగరాజు…
ఆయనో మాజీ ఎమ్మెల్యే. పెద్ద బ్యాక్‌గ్రౌండ్ నుంచే పాలిటిక్స్‌లోకి వచ్చారు. ప్రస్తుతం అధికారపార్టీలో టచ్ మీ నాట్‌గా మారిపోయారు. పార్టీ పిలిచినా ఉలుకు లేదు.. పలుకు లేదు. అలిగారా? లేక జారిపోతున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? టీఆర్ఎస్ ప్లీనరీకి డుమ్మా..! జలగం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నాయకుడు మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ నేత. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయ…
పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో చర్చగా మారాయి.. రచ్చ రచ్చ అవుతోంది. స్వపక్షంలోని వ్యతిరేకులకు ఛాన్స్ ఇవ్వకుండా సొంతవారితో కమిటీలు నింపేస్తున్నారట ఎమ్మెల్యేలు. అవకాశం దక్కని నేతలు.. వారి అనుచరులు గుర్రుగా ఉన్నారట. ఈ అసంతృప్తి ఎన్నికల నాటికి ఏ విధంగా భగ్గుమంటుందో అనే టెన్షన్ కేడర్‌లో ఉందట. కమిటీల ఏర్పాటులో అగ్గి రాజేస్తోన్న వర్గపోరు..! ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రస్తుతం వలస నేతలు, కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది. అప్పట్లో టీడీపీ…
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పీసీసీతోపాటు కేడర్ కూడా క్షేత్రస్థాయిలో గురి పెట్టిందా? అందుకే సడెన్‌గా ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలకు భద్రత పెంచారా? కేసులు పెడుతున్నా.. కాంగ్రెస్ కేడర్ ఎందుకు దూకుడుగా వెళ్తోంది? ఈ వైఖరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు వర్కవుట్ అవుతుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కేడర్ గురి..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా కాంగ్రెస్ గేర్ మార్చి దూకుడు పెంచింది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా.. కాంగ్రెస్…
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లో రిజర్వేషన్ లు పెట్టిన తోలి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయరు. రైతే వెన్నుముక అన్న పార్టీలకు రైతు బంధు లాంటి పథకాలు అమలు చేయాలని ఆలోచన లేదు. కరెంటు అడిగితే కాల్చి చంపారు. మరో పార్టీ రైతు పంటలను ఎక్కడ…
ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం.. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన.. అయితే తాజాగా ఓ ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు..వివరాల్లోకి వెళ్తే, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు…
వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామానికి చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం రోజుల రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి నిరుద్యోగ నిరాహార…
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండి నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా కరోనా బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులు కరోనా బారిన పడితే, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉండటం చేస్తారు. ఇక పల్లేల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెల్లో కరోనా బారిన పడిన వ్యక్తులు ఊరికి దూరంగా ఉంటున్నారు. కరోనా తగ్గేవరకు గ్రామంలోకి అడుగుపెట్టడంలేదు. అయితే, తెలంగాణలోని ఖమ్మంజిల్లా,…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కంటిమీద నిద్ర లేకుండా చేస్తుంటే.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడడం కలకలంగా మారుతోంది.. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ తరహా కేసులు బయటపడ్డాయి.. తాజాగా.. ఖమ్మం జిల్లాలోనూ బ్లాక్ ఫంగస్ కేసు తీవ్ర కలకలంగా మారింది… మధిర నియోజకవర్గంలోని నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో.. ఆప్రమత్తమైన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి…
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ లో ఏ ఏ డివిజన్లలో ఎవరు గెలిచారో ఇప్పుడు చూద్దాం. 7 వ డివిజన్ బీజేపీ దొంగల సత్యనారాయణ గెలుపు 13వ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్తి కొత్తపల్లి నీరజ గెలుపు.. 20 వ డివిజన్ టీఆరెస్ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మి గెలుపు …