ఓ ఐఏఎస్ అధికారి వెడ్డింగ్ ఇన్వటేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది… తొలిచూపు నుంచి పెళ్లి పీటల వరకు జరిగిన తమ లవ్ స్టోరీని కవితగా మలచి.. ఓ సినిమా స్టైల్లో యాజిమేషన్ రూపంలో తయారు చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా పని పనిచేస్తున్న రాహుల్‌ది మహబూబ్‌నగర్ జిల్లా.. ఈ నెల 10వ తేదీన మనీషా అనే యువతిని పెళ్లిచేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన…
తెలంగాణలోని ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని, పీహెచ్ సీల పడకల సామర్థ్యాన్ని పెంచాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోగ్య మంత్రి హరీష్ రావు కు వినతిపత్రం అందచేశారు. పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడానికి యుద్ధ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరారు. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు భట్టి…
ఇటీవల ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలిచిన తాతామధు గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న గ్యాప్‌లను భర్తీ చేస్తానన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో నిర్మాణ పరమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా తన వంతు సాకారం అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతం ను, తెలంగాణ ఏర్పడడానికి గల కారణాలను ప్రజల వద్దకు తీసుకుని ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీని ఒక్క…
ఖమ్మం బ్రాహ్మణ బజార్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. Read Also: మీకు కరోనా సోకిందా.. అయితే ఈ మందులు…
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రాఘవను రిమాండ్ విధించింది. Read Also: గాంధీ ఆస్పత్రికి…
కొత్తగూడెంలో టీఆర్ఎస్కు కొత్త నేత అవసరం వచ్చిందా? వనమా రాఘవ వ్యవహారంతో జలగం అక్కడ మళ్లీ యాక్టివ్ అవుతారా? ఆ నియోజకవర్గంపై కన్నేసిన గులాబీ నేతలు ఎవరు? మారిన పరిణామాలు ఎవరికి ఆశలు రేకెత్తిస్తున్నాయి? కొత్తగూడెం టీఆర్ఎస్ పరిణామాలపై ఆసక్తిఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో.. రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు జైలు పాలయ్యారు. ఈ కేసు రాజకీయంగా దుమారం రేపింది. ఒకవైపు వనమా రాఘవను టీఆర్ఎస్ సస్పెండ్…
తెలంగాణలో రైతు బంధు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గులాబీ నేతలు తమ అధినేతపై అభిమానాన్ని వెరైటీగా చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే కేసీఆర్ బొమ్మను వెరైటీగా తయారుచేయించారు. 200 క్వింటాల్ నవ ధాన్యాలతో కేసీఆర్ బొమ్మతో పాటు జై తెలంగాణ, రైతు బంధు నినాదాలతో రూపొందించారు. పంట పొలాల్లో కేసీఆర్ బొమ్మని వడ్లు బియ్యం ,మొలకలతో తయారుచేసి వెరైటీగా రైతు బంధు ఉత్సవాలను నిర్వహించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. దీనిపై ఊరి పేరుతో పాటు జై…
అప్పుల బాధతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. రామకృష్ణతో పాటు ముగ్గురు చనిపోయిన వ్యవహారంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో గోప్యతను పాటిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గతంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుటుంబం పాత్ర ఉందని ప్రచారం జరిగింది.…
అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని…
అధికారపార్టీలో చేరాక.. నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా గేర్ మార్చారా? మంత్రిపైనే పైచెయ్యి సాధించారా? కీలక పదవిని తన నియోజకవర్గానికి దక్కించుకుని చర్చల్లోకి వచ్చారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పదవి? ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ వేడి సెగలు రేపుతున్న సమయంలో.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి నియామకం మరో కొత్త చర్చకు దారితీసింది. పార్టీ నేత కొత్తూరు ఉమా మహేశ్వరరావుకు…