ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఓ నవజాత శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యునిపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండా కు చెందిన నిండు గర్భిణీని ప్రసూతి నిమిత్తం తొలుత జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో…
ఖమ్మంజిల్లా టీఆర్ఎస్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్ వెనక ఉన్నదెవరు? వారిని పార్టీ గుర్తించిందా? చర్యలు తీసుకుంటుందా? ఇంతలోనే జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకుంటున్నారు? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించిందెవరు? పోలింగ్ జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా.. చర్చ మాత్రం క్రాస్ ఓటింగ్‌పైనే కొనసాగుతోంది. పోలింగ్ జరిగిన జిల్లా రాజకీయాల్లో ఈ అంశంపైనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఖమ్మం జిల్లా ఫలితాలు అధికారపార్టీలో అలజడి…
పోలింగ్ జరిగిన ఆరుచోట్లా ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ కైవశం చేసుకున్నా.. ఆ జిల్లాలో మాత్రం పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్నిక ఏదైనా అక్కడ వెన్నుపోట్లు తప్పదా..? భారీగా క్రాస్ ఓటింగ్‌కు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ సూత్రధారి ఎవరు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు చెందిన తాతా మధు గెలిచారు. పార్టీ శ్రేణలు సంబరాలు చేసుకున్నాయి. కానీ.. టీఆర్ఎస్ అభ్యర్థికి రావాల్సిన ఓట్లు రాలేదు. పైగా…
జనంలో అత్యాశ ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్ళు ఉంటారని ఇద్దరు నకిలీ బంగారం దొంగలు మరోసారి నిరూపించారు. బంగారం మీద ఉన్న మోజు ఉన్న వరంగల్ వాసులను మోసం చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్న అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు వరంగల్ పోలీసులు. వారిని కటకటాల వెనుకకు నెట్టారు. పోలీసుల వెనుక నిలబడ్డ ఈ ఇద్దరు కేడీలు కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణంకి చెందిన మోహన్‌లాల్. సోలంకి ధర్మ. వీళ్ళేం మామూలు వ్యక్తులేం కాదు. జనానికి బంగారంపై…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తాను ముందే చెప్పానని లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. తాతా మధు గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎ కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది.. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మొదక్ జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్లో రెండు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు అధికారులు.. ఇక, ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకిదిగిన రాయల నాగేశ్వరరావు.. కౌంటింగ్‌ను నిలిపివేయాలని కోరారు..…
తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కరీంనగర్లో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానానికి గానూ మొత్తం 26 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లో 5,326 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్…
మూడో భార్య కోసం రెండో భార్యకు నిత్య పెళ్లికొడుకు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో నిత్య పెళ్ళికొడుకు బాగోతం బట్టబయలయింది. రెండోభార్యను హతమార్చేందుకు నిత్య పెళ్ళికొడుకుఈ దారుణానికి ఒడిగట్టాడు. కంప్యూటర్ యుగంలోనూ తాంత్రిక పూజలు చేయడం సంచలనం కలిగించింది. పాల్వంచ మండలం శేఖర బంజరకు చెందిన కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం ఒక మహిళను పెళ్ళాడాడు. వీరికి పిల్లలు కూడా వున్నారు. మరో మహిళను రెండో…
ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఒకే సామాజిక వర్గం కూడా. పూర్వాశ్రమంలో ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగారు. మరి.. పాత పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తాయా.. లేక ఒకరివైపే మొగ్గు చూపుతాయా? టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పూర్వం కమ్యూనిస్ట్లే..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల పేరు ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆ పార్టీది టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత ప్లేస్. ఉనికి…
ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుభూతి కోసం చేతులు అడ్డుపెట్టుకుని ఏడ్చారన్నారు సామినేని ఉదయభాను. ఆనాడు శాసనసభలో భువనేశ్వరి గురించి ఏమీ మాట్లాడలేదని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఏమి జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎంతో ధైర్యంగా ఉండాలి. చంద్రబాబులా ఇప్పటివరకూ…