తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోబోతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక…
వైఎస్ షర్మిల ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటిస్తానని చెప్పారు. ఇక నిరుద్యోగుల కోసం ఆమె ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షకు దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే రాష్ట్రంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల…
ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేపు రిజర్వేషన్స్ ప్రకటన ఉంటుంది. కార్పొరేషన్ల తో పాటు కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, అచ్చంపేట తో పాటు మరికొన్నింటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా పలు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎస్ఈసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలక శాఖ గతంలోనే…