ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు.
ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం కార్యకర్తలు పనిచేశారు.. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలని అన్నారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్‌ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో తన కళ్ళకు పరీక్ష చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
కేసీఆర్ ఏమైనా దేశ నాయకుడా ఆయన పుట్టినరోజు నాడు సెకటేరియట్ ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ జయంతి నాడు సెకటేరియట్ ను ఎందుకు ప్రారంభించరు? కేసీఆర్ ఉన్న ఇబ్బంది ఏంటి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. నిన్న బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు.
కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని…