Khairatabad-Balapur Ganesh Live Updates: గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
Balapur Laddu: వినాయక చవితి అనగానే హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహం, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అందరూ ఈ రెండు విషయాల గురించి చర్చించుకుంటారు.
Khairatabad Ganesh: హైదరాబాద్ నగరంలో అతిపెద్ద వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు. ఆయనను దర్శించుకునేందుకు నగర ప్రజలు పోటెత్తారు. సాధారణ రోజుల్లో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటే.. సెలవంటే ఎలా? ఆదివారం ఖైరతాబాద్‌కు ఇసుకలా జనం తరలివచ్చారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నగరంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు.
జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కూడా వాన ఆటంకంగా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డులు దెబ్బతినడంతో.. గణేష్ నిమజ్జనానికి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ అంతా సోభాయమానంగా మారింది. నిమజ్జనానికి వచ్చే భక్తులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్…
Khairatabad Ganesh: వినాయక ఉత్సవాల మొదటి రోజే, హైదరాబాద్ నగరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా బీజేపీ కార్య కర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు, రాజాసింగ్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసేకుంది, నిరసనకారులను అరెస్టు చేసి, రాంగోపాల్ పేట్ ఠాణాకు తరలించారు. ఇవాళ ఖైరతాబాద్…