వినాయక చవితి తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు.. గణేష్ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే… ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధం అవుతున్నాడు.. అందులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు కర్ర పూజతో ప్రారంభించారు.. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి కర్రపూజ నిర్వహించింది గణేష్ ఉత్సవ కమిటీ.. ప్రభుత్వ…
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహంపై గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. అలాగే మట్టి విగ్రహమే పెడతామని ప్రకటించింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం కీలకంగా మారింది.. కాగా, ఇప్పటివరకూ వినాయక విగ్రహాన్ని…
ఖైరతాబాద్ గణపయ్యను దర్శించేందుకు వందలాది మంది భక్తులు నిత్యం వస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా 40 అడుగుల ఎత్తైన మహా గణపతిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణపయ్యకు మొదటిసారి తలపాగను ఏర్పాటు చేశారు. తలపాగతో ఖైరతాబాద్ గణపయ్యకు కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. బాహుబలి సినిమాలు తలపాగలు తయారు చేసిన చార్మినార్‌కు చెందిన బృందం మహాగణపతికి తలపాగను తయారు చేశారు. 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే విధంగా మహాగణపతికి తలపాగను తయారుచేశారు. ఈ తలపాగతో…
వినాయక చవిత వచ్చిందంటే గణేష్ ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి.. ముఖ్యంగా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలకు, నిమజ్జనానికి ప్రత్యేకస్థానం ఉంది.. ఇక, ఖైరతాబాద్‌లో కొలువుదీరే మహా గణనాథుడి విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా ప్రత్యేకమనే చెప్పాలి.. ఒక్కోఏడాది ఒక్కోరూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనాను ఇవాళే ఆవిష్కరించింది ఉత్సవ కమిటీ.. పంచముఖ రుద్ర మహాగణపతిగా భారీ గణనాథుడి దర్శనమివ్వనుండగా.. మండపంలో గణనాథుడికి ఎడమ…