Balapur Laddu: వినాయక చవితి అనగానే హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహం, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అందరూ ఈ రెండు విషయాల గురించి చర్చించుకుంటారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఇంతై ఇంతింతై వటుడింతై అంటూ దేశవ్యాప్తంగా పాపులర్. వందల నుంచి మొదలైన వేలం ఇప్పుడు లక్షలకు చేరింది. వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారికి మేలు జరుగుతుందని నమ్మకం. దీంతో ఈ లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు వేలంలో పోటీ పడుతున్నారు. ఈ లడ్డూను పొందేందుకు గతంలో లడ్డూలు పొందిన వారు కూడా మళ్లీ మళ్లీ పోటీ పడుతున్నారు. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. అయితే 2022లో రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. మరియు 2023 సంవత్సరానికి రూ. 27 లక్షలకు బాలాపూర్ లడ్డూను దాసరి దయానంద రెడ్డి దక్కించుకున్నారు. అయితే 1994 నుంచి 2023 వరకు బాలాపూర్ లడ్డూ ఎవరికి దక్కింది అనేది చూద్దాం.
బాలాపూర్ నుంచి లడ్డూలు తెచ్చుకున్న వారు…
1) కొలన్ మోహన్ రెడ్డి 450/- 1994.
2 కొలన్ మోహన్ రెడ్డి 4500/ -. 1995.
3)కొలన్ కృష్ణ రెడ్డి 18000/-. 1996.
4)కొలన్ కృష్ణా రెడ్డి 28000/- 1997.
5) కొలన్ మోహన్ రెడ్డి 51000/- 1998.
6) క్రానెం ప్రతాప్ రెడ్డి 65000/- 1999.
7) కంటి అంజి రెడ్డి 66000/- 2000.
8) జి. రఘునందన్ చారి 85000/- 2001.
9) కందాడ మాధవరెడ్డి 105000/- 2002.
10) చిగురాంత బాల్ రెడ్డి 1,55000/- 2003.
11) కొలన్ మోహన్ రెడ్డి 2,01000 2004.
12) ఇబ్రహీం శేఖర్ 2,08000 2005.
13) చిగురాంత తిరుపతి రెడ్డి 300000 2006.
14)జి.రగునందన్ చారి 4,15000/- 2007.
15) కొలన్ మోహన్ రెడ్డి 5,07000/- 2008.
16) సరిత 510000/- 2009.
17) కోడలు శ్రీధర్ బాబు 535000/- 2010.
18) కోలన్ బ్రదర్స్ 545000/- 2011.
19)పన్నాల గోవర్ధన్ 750000/- 2012.
20) తీగల కృష్ణ రెడ్డి 926000/- 2013.
21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950000/- 2014.
22) కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 1032000/- 2015.
23) స్కైలాబ్ రెడ్డి 14,65000 /- 2016.
24) నాగం తిరుపతి రెడ్డి 1560000 /- 2017.
25) శ్రీనివాస్ గుప్తా 16.60000 /- 2018
26) పూల్ రామ్ రెడ్డి. 17.50 లక్షలు -2019
27) కరోనా కారణంగా వేలం జరగలేదు. కానీ ఈ లడ్డూ మాత్రం కేసీఆర్ కుటుంబానికే దక్కింది. 2020
28.) AP EMMC రమేష్ యాదవ్, శశాంక్ రెడ్డి. రూ.18.90 లక్షలు – 2021
29) వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలు- 2022
30) దాసరి దయానంద రెడ్డి 27 లక్షలు -2023
https://www.youtube.com/watch?v=p9zQ8osr8is&ab_channel=NTVLive