Khairatabad Ganesh 2023: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల చర్చ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించే.. ఈ సారి ఎన్ని అడుగుల విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు.. ఏ రూపంలో భక్తులకు గణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు.. అనే చర్చ సాగుతోంది.. ఇక, ఒక్కసారైనా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు.. ఇలా క్రమంగా ప్రతీ ఏడాది భారీ గణపయ్యకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది.. భారతదేశంలోని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో గణేష్ చతుర్థి వార్షిక పండుగ సందర్భంగా స్థాపించారు.. ఏటా నిర్మించబడింది మరియు దాని ఎత్తు మరియు బొమ్మ చేతిలో పట్టుకున్న లడ్డూకు ప్రసిద్ధి చెందింది, ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శించే 10 రోజుల పండుగ సందర్భంగా ఈ విగ్రహాన్ని పూజిస్తారు. 11వ రోజున విగ్రహాన్ని సమీపంలోని హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.
Read Also: YSR Kapu Nestham: కాపులకు సీఎం జగన్ శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ
అయితే.. బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో , సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లోని ఒక ఆలయంలో 1 అడుగు (0.30 మీ) గణేష్ విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు. నిర్మించబడిన విగ్రహం యొక్క ఎత్తు 2014 వరకు ప్రతి సంవత్సరం ఒక అడుగు పెరుగుతుంది.. ఎలా ప్రతీ ఏడాది పెరుగుతూ 2019లో విగ్రహం శిఖరం ఎత్తు 61 అడుగులకు చేరింది.. తద్వారా ఆ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా అవతరించింది. ఇక.. అక్కడి నుంచి మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలు పెట్టారు.. అంతేకాదు.. హుస్సేన్ సాగర్ సరస్సుకు మార్గం యొక్క పరిమితులు మరియు పర్యావరణ సమస్యల కారణంగా పరిమాణం తగ్గిస్తూ వస్తున్నారు.. అంతే కాదు.. మట్టి గణపయ్యను ఏర్పాటు.. ఈ ఏడాది ఆ మట్టి గణపయ్య ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.. ఇంతకీ ఖైరతాబాద్ గణపతి సాధించిన ప్రపంచ రికార్డు ఏంటో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..