ఖైరతాబాద్ వినాయకుడు వద్ద కర్ర పనులు స్పీడ్ అందుకున్నాయి. రేపు ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈరోజు 9 గంటలకు మహా హారతి కార్యక్రమం ఉంటుంది.. అనంతరం 11.30 గంటలకు కలశం పూజ నిర్వహిస్తారు.. రేపు మంగళవారం కావడంతో సోమవారం రోజులో ఉండగానే మహా గణపతిని కదిలిస్తారు. 12 గంటల తరువాత మహా గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు.
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రేపు శోభాయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి, బేగంబజార్, మోజం జై మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు.
Khairatabad Ganesh: ఇవాళ రోజు కావడంతో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అయితే, ఈరోజు రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ మహా గణనాధుడికి కలశపూజ నిర్వహించనున్నారు.
Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లోని బడా గణేష్ దర్మన్ కోసం భక్తులు క్యూ కట్టారు. చివరి రోజు ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లోని 70 అడుగుల ఎత్తైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని గురువారం అలంకరించనున్నారు. శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు 70 అడుగుల విగ్రహాన్ని అన్ని వివరాలతో ఒకటిన్నర రోజుల్లో పూర్తి చేశారు.
Khairatabad Ganesh : మన దేశంలో చాలా పండుగలు జరుగుతాయి. ఇకపోతే హిందువులకు అనేక పండుగలు ఉన్నాయి. దీపావళి, దసరా, సంక్రాంతి, రాఖీ, వినాయక చవితి ఇలా ఎన్నో. అందులోనూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక హైదరాబాద్ నగరవాసులు ఖైరతాబాద్ లోని ప్రసిద్ధ మహాగణపతిని చాలా భక్తితో పూజిస్తారు. ఖైరతాబాద్ విగ్రహ వేడుకల కమిటీ శతాబ్దాలుగా స్థాపన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా గణేశ నవరాత్రుల సమయంలో హైదరాబాద్ వచ్చిన ఎవరైనా వినాయకుడిని తప్పక…