ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడం రాజకీయ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ధన్‌ఖర్ ఉల్లాసంగానే కనిపించారు.
కునాల్ కమ్రా.. స్టాండప్ కమెడియన్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయ్యారు. ఇక ఆయనపై మహారాష్ట్రలో పలు కేసులు నమోదయ్యాయి.
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. కవిత మీడియాతో చిట్‌చాట్ చేశారు.
బీజేపీ, కాంగ్రెస్‌కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు.
బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు కనిపిస్తోంది.
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్-చైనా కుట్రలు ఉన్నతంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్విదేది కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలను అంగీకరించాలన్నారు.
కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో సగం జనాభా.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జనాభా ఉన్నారని తెలిపారు. సగం జనాభా ఉన్న చోట ఒక్క మంత్రి కూడా లేడన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 55 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.