బీహార్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం ఈసీ బృందం శనివారం పాట్నాకు వచ్చింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి ఆయుధాలు సరఫరా చేసిన తుర్కియేపై భారతీయులు నిరసన కొనసాగిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు రూ. 5,337 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించినట్లు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మీడియాతో మాట్లాతుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో…
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. హైడ్రాకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది.. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
Film Chamber : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడనున్నాయి.సమ్మర్ సీజన్ మొదలైన థియేటర్స్ లోకి పెద్ద సినిమాలేవీ కూడా విడుదల కాలేదు.దీనికి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం కారణంగా చెప్పవచ్చు.సంక్రాంతి సీజన్ తర్వాత సమ్మర్ సీజన్ కే అంతటి డిమాండ్ ఉంటుంది. సమ్మర్లోనే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి.అలాగే సమ్మర్ లో స్కూల్స్ కి ,కాలేజెస్ కి సెలవులు ఇవ్వడంతో చిన్న ,పెద్ద అంతా…
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు.