బీహార్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 22 లోపు ముందే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం ఈసీ బృందం శనివారం పాట్నాకు వచ్చింది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతల అభిప్రాయాలను సేకరించారు. తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియను ముగించాలని అన్ని పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి.
ఇది కూడా చదవండి: Eswatini Royal Family: ఆ రాజుకు ప్రతి ఏడాది ఓ కొత్త భార్య.. ఇప్పటికే 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు.. ఆయన ఎవరో తెలుసా!
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈలోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తోంది. ఇక దీపావళి తర్వాత బీహార్‌లో అత్యంత గ్రాండ్‌గా జరుపుకునే ఉత్సవం ఛత్. ఈ పండుగ అక్టోబర్ 25 నుంచి 28 వరకు జరుగుతుంది. ఈ ఛత్ పండుగ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా బీహారీయులంతా సొంత ఇళ్లకు వచ్చేస్తారు. ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా కచ్చితంగా ఛత్ పండుగ కోసం తరలివస్తారు. వచ్చిన వారు తిరిగి వెళ్లిపోకముందే ఎన్నికల ప్రక్రియను ముగించేయాలని అన్ని పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎక్కువ విడతల్లో కాకుండా.. తక్కువ సమయంలోనే ఎన్నికలు ముగించాలని.. దీని కారణాన ప్రచార భారం కూడా తగ్గుతుందని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారంలోనే ఎన్నికల నిర్వహించాలని ఈసీ కూడా భావిస్తున్నట్లు సమాచారం. 2020లో కోవిడ్ సమయంలో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అప్పటిలాగా కాకుండా ఈసారి ఒకటి, రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను ముగించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: PriyaPrakashVarrier : ప్రియా ప్రకాష్.. అందాలు శెభాష్
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 2 షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) 38 షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) కోసం రిజర్వు చేయబడ్డాయని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తయిందని చెప్పారు. అలాగే బూత్ స్థాయి శిక్షణ కూడా నిర్వహించినట్లు చెప్పారు. తొలిసారిగా 700 మంది బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిందని… ఎన్నికల సంసిద్ధతను సీఈసీ వ్యక్తం చేశారు. వచ్చేే వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి
ఇది కూడా చదవండి: Bobby Deol : అతని వల్లే నేను ఇక్కడున్నా – బాబీ డియోల్ ఎమోషనల్ కామెంట్స్