Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ షష్ట షణ్ముఖ ఆలయాల సందర్శన ముగిసింది.. చివరగా తిరుత్తణి ఆలయ దర్శనం చేసుకున్న పవన్.. ఈ రోజు మధ్యాహ్నానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. మొత్తం ఆరు దేవాలయాలను తమిళనాడులో, కేరళలో ఒక దేవాలయం దర్శించుకున్నారు పవన్.. తిరుమల లడ్డూ వ్యవహారంపైన ఆలయాల సందర్శనలో స్పందించారు. ఆయుర్వేద ప్రధానమైన ఆలయాలను దర్శించుకుని, తన ఆరోగ్య పరిస్థితిని సైతం అక్కడి వైద్యులకు చూపించుకుని, వైద్య సలహాలు తీసుకున్నారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఓలా నుంచి టీవీఎస్ వరకు బెస్ట్ ఈవీలు ఇవే!
ఇక, డిప్యూటీ సీఎం పర్యటన ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. మొదటి రోజు కొచ్చి చేరుకున్న పవన్.. మొదటగా కేరళలోని చొట్టనిక్కర లోని అగస్త్య ఆశ్రమం దర్శించారు.. అక్కడ అగస్త్య మహాముని ఆలయంలో పూజలు నిర్వహించారు.. అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు విష్ణు యోగి, మణి యోగి వివరించారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి ప్రదక్షిణ చేశారు పవన్. అనంతరం అగస్త్య మహర్షికి పవన్ కల్యాణ్ సంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మహా ఋషుల ఆలయాలను దర్శించుకున్నారు. సుదీర్ఘంగా పవన్ ని బాధపెడుతున్న నడుము నొప్పి, స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేదంలో అవలంబించే చికిత్స విధానాలను పవన్ ఆశ్రమ వైద్యులను అడిగి తెలుసుకున్నారు..
Read Also: Chilkuru Balaji Temple Priest: రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు..
అగస్త్య ఆలయ దర్శనం తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు.. తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా ఆవేదన. తిరుమల లడ్డూలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే నా బలమైన ఆకాంక్ష అని చెప్పారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత పర్యటన.. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. రాజకీయాలకు సంబంధం లేదు అని తెలిపారు… తిరువనంతపురం సమీపంలోని తిరువళ్ళంలోని పరశురామర్ ఆలయాన్ని దర్శించుకున్నారు డిప్యుటీ సీఎం పవన్… ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పవన్, ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి.. పరశురామర్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also: MP: సైలెంట్ హార్ట్ ఎటాక్!.. గుర్రంపై పెళ్లి వేదిక వద్దకు వెళ్తూ వరుడు మృతి (వీడియో)
రెండవ రోజు పవన్ కల్యాణ్.. నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.. రెండో రోజు మొదటగా పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు లోని కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రంలో స్వామినాథ స్వామి (కుమారస్వామి)ని దర్శించుకున్నారు… షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టి స్కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు.. ఆది ప్రణవనాదం ఓం కార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్ర దర్శనం అద్భుతంగా జరిగింది.. శ్రీ స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు పవన్ కి డిప్యూటీ కమిషనర్ ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కుంభకోణలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించారు. ఈ ఆలయంలో శివలింగంతోపాటు ప్రతి అణువు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కుంభేశ్వరాలయ దర్శనానికి ఎవరు వచ్చినా మొదట ఆది గణపతి దర్శనం తర్వాతే మూల విరాట్ దర్శించాలన్న నియమం ఉండటంతో, గణపతి దర్శనం చేసుకున్నారు.. అమృతం, ఇసుక కలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరని తెలిపి, విశిష్ట పూజలు నిర్వహించారు. పార్వతీదేవి అవతారం శ్రీ మంగళనాయకి అమ్మన్ ని మంత్రపీఠేశ్వరిగానూ కొలుస్తారు. 72 కోట్ల మంత్రాల శక్తి అమ్మవారిలో నిక్షిప్తమై ఉండడం వల్ల అమ్మవారికి ఆ పేరు వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా పవన్ ఆ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Read Also: Haryana: గ్రేట్.. పుల్వామా దాడిలో అమరుడైన జవాన్ కుమారుడు.. అండర్-19 జట్టుకు ఎంపిక
స్వామిమలై, కుంభకోణం సందర్శనకు వెళ్లిన పవన్ కి బీజేపీ తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూల మాలలు, శాలువాలతో బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్‌ని సత్కరించారు. బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. కుంభేశ్వరాలయంలో తనను చూసేందుకు వచ్చిన తెలుగు విద్యార్ధులకు పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీలు ఇచ్చి ఉత్సాహపరిచారు. ఆ తరువాత అక్కడి నుంచీ బయలుదేరి తమిళనాడులోని తిరుచెందూరు క్షేత్రానికి వెళ్లి అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపరంకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ చివరగా తమిళనాడులోని కుంభకోణంలో కొలువైన ఆది కుంభేశ్వరర్ ఆలయాన్ని, అగస్త్య జీవ సమాధిని దర్శించుకున్నారు… పళని సుబ్రహ్మణ్యేస్వరుని, అలాగే వినాయకుడిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం… పళని నుంచి తిరుమలకి వచ్చే భక్తులకి రవాణా సౌకర్యంపై దృష్టిపెడతామని తెలిపారు. పళనిలో అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ చాలా సేపు ఉన్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
మధురై పట్టణంలోని శ్రీ మీనాక్షి అమ్మన్, శ్రీ సోమసుందరేశ్వన్ వార్లను పవన్ దర్శించుకున్నారు… ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ అధికారులు పవన్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శ్రీ మీనాక్షి అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లారు.. పవన్ మొక్కులో భాగంగా అమ్మవారికి సారె, చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు.. పవన్ తో ఆలయ రుత్వికులు ప్రత్యేక పూజలు చేయించారు… ఆలయంలోనే కూర్చుని పరాశక్తి పారాయణం చేసారు.. శ్రీ సోమ సుందరేశ్వర స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు… శ్రీ సోమ సుందరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు.. ఇక, ఇవాళ తిరుత్తణి దర్శనంతో పవన్ షష్ట షణ్ముఖ యాత్ర పూర్తికానుంది… షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలో అళగర్ కొండల్లో కొలువైన పలముదిర్చోలై అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని పవన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ ను పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయా అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు పవన్ కు అందించారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో పవన్ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆయన వెంట అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. మురుగన్ దర్శనం అనంతరం పవన్ ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటివరకు అయిదు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాల దర్శనం పూర్తయిందని, సాయంత్రం తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర సందర్శనతో షణ్ముఖ యాత్ర పూర్తవుతుందని చెప్పారు పవన్.. మురుగన్ దర్శనం అనంతరం ఆలయ పారిశుధ్య కార్మికులను చూసి తన కాన్వాయ్ ను ఆపి వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగి ఆర్థిక సాయం అందించారు. మొత్తంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్సనంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షష్ట షణ్ముఖ యత్ర పూర్తయింది..