కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా అంగీకరించారు. దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు.
READ MORE: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!
ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. చర్చికి సంబంధించిన 1.8 ఎకరాల భూమిని కాసావా (టాపియోకా) సాగు కోసం దున్నుతున్నారు. ఈ ప్రదేశం శ్రీ వనదుర్గా భగవతి ఆలయం నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. అవశేషాలు బయటపడటంతో ఆలయ కమిటీ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా.. శ్రీ వనదుర్గా భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కెఎస్ మాట్లాడారు. “వాస్తవానికి ఫిబ్రవరి 4న అవశేషాలు దొరికాయి. అయితే రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించాం. అప్పుడే స్థానికులకు ఆ స్థలం గురించి తెలిసింది. దీని తరువాత.. ఆలయ కమిటీ చర్చి నిర్వాహకులను సంప్రదించింది. హిందూ సమాజం యొక్క మనోభావాలను గౌరవిస్తూ పూజలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అంగీకరించారు. ” అని తెలిపారు.
READ MORE: Rekhachitram: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘రేఖా చిత్రం’.. ఎప్పుడంటే?
మీనాచిల్ (పలై) హిందూ మహాసంఘం అధ్యక్షుడు న్యాయవాది రాజేష్ పలాట్ ఈ స్థలానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఇక్కడ ఆలయం ఉన్నట్లు తమ పూర్వీకులు కథలు చెప్పినట్లు తెలిపారు. ఈ భూమి ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని పూర్వీకులు చెప్పారన్నారు. కానీ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, క్రమంగా భూమి హిందూ యజమానుల నుంచి క్రైస్తవ సమాజానికి బదిలీ అయిందన్నారు.