ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందా? కేరళ బీజేపీకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది.
కేరళ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కాసరగోడ్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. తొలుత ఈ సర్వీసు కన్నూర్‌లో ముగియాల్సి ఉంది. కేంద్ర మంత్రి వి మురళీధరన్ అభ్యర్థన మేరకు సర్వీసు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
శబరిమల విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ‘సైట్ క్లియరెన్స్’ మంజూరైంది. ఏప్రిల్ 3న జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Girl kidnapped Ex Boyfriend: ప్రేమకు కులం, గోత్రం, ప్రాంతం, ఆస్తులు.. ఇలా ఏవీ అడ్డుకాదంటారు.. అయితే, ప్రస్తుతం ప్రేమలు ఎన్నిరోజులు కొనసాగుతాయో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది.. ఒకరికి బ్రేకప్ చెప్పి.. మరొకరితో చెట్టాపట్టాల్ వేసుకుతిరుగుతున్నారు.. అంతే కాదు.. విడిపోయిన తర్వాత కూడా కిడ్నాప్‌లు, చిత్రహింసలకు గురిచేయడం లాంటి ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. కేరళలో తాజాగా ఓ సంచనల కేసు వెలుగు చూసింది.. మొదటి లవర్ బ్రేకప్ కు ఒప్పుకొలేదని రెండో లవర్‌తో కలిసి…
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అప్రమత్తం అయింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఐసీయూలు, ఆక్సిజన్ సదుపాయాలపై సూచనలు చేశారు. ఓ నెల క్రితం వరకు కేవలం వెయ్యి లోపలే ఉన్న రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ నేతలు పీయూష్ గోయల్, వి మురళీధరన్, బిజెపి కేరళ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ సమక్షంలో అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు.
Kerala Train Attack: కేరళ ట్రైన్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్రైన్ లో నిప్పంటించి ముగ్గురు మరణాలకు కారణం అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు షారుఖ్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి పట్టుకున్నారు. మహరాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
Kerala Train: కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైలులో గొడవ నేపథ్యంలో.. తోటి ప్యాసింజర్‌పై పెట్రోల్‌పోసి, నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 9మంది గాయపడ్డారు.
కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) హెలికాప్టర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.
కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి రెండు రోజులలో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి రెండు రోజులలో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే, స్థానిక దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని దీని వెనుక ఉన్న నమ్మకం.