ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందా? కేరళ బీజేపీకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కేరళ తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి, కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానిపై ప్రాణాంతక దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ తనకు బెదిరింపు లేఖ వచ్చిందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి మలయాళంలో రాసిన లేఖను వారం రోజుల క్రితం ప్రాంతీయ పార్టీ కార్యాలయానికి పంపించారని, ఈ లేఖను రాష్ట్ర డీజీపీకి అందజేసినట్లు సురేంద్రన్ తెలిపారు. జీ ప్రధాని రాజీవ్ గాంధీకి జరిగిన విధంగానే మోడీపై కూడా దాడి జరుగుతుందని లేఖలో హెచ్చరించినట్లు చెప్పారు.
Also Read:PSLV-C55 ప్రయోగం విజయవంతం
దీంతో రంగంలో దిగిన పోలీసులు లేఖలో ఉన్న చిరునామా ఆధారంగా లేటర్ రాసిన వ్యక్తి కొచ్చికి చెందిన ఎన్‌కె జానీగా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లి లేఖ గురించి ప్రశ్నించారు. కొచ్చికి చెందిన జానీ, లేఖ రచయిత అని కొట్టిపారేశాడు, అయితే తన పట్ల పగతో ఉన్న ఎవరైనా హత్య బెదిరింపుకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే, ఆ లేఖ తాను రాయలేదని జానీ తెలిపాడు. అయితే తన పట్ల పగతో ఉన్న ఎవరైనా ఈ బెదిరింపు లేఖ రాసిఉంటారని అభిప్రాయపడ్డారు. పోలీసులు తన చేతివ్రాతను లేఖతో పోల్చారని, అది రాసింది తాను కాదని నిర్ధారించారని జానీ పేర్కొన్నాడు. తన పట్ల శత్రుత్వం కలిగి ఉన్న వ్యక్తి ఈ బెదిరింపుకు కారణమై ఉండవచ్చని చెప్పాడు. తాను అనుమానిస్తున్న వ్యక్తుల పేర్లను వెల్లడించాడు.
Also Read:Amit Shah: బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు వదులుకుంటుంది?