భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు వారీ కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,171 కరనా ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య 51,314కి తగ్గింది. అయితే కరోనా వైరస్ తో 40 మరణించారు. ఒక్క కేరళలోనే 15 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మరణాల సంఖ్య 5,31,508కి పెరిగింది.
Also Read:Constable final exam: రేపే పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లు. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉన్నాయి. దీంతో, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.70 శాతంగా నమోదైంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,56,693కి పెరిగింది. అదనంగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.