Doctor Stabbed To Death: కేరళలో లేడీ డాక్టర్ హత్య రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేరళలోని కొల్లాం జిల్లాలోని కొట్టారక్కర ప్రాంతంలో బుధవారం 23 ఏళ్ల వైద్యురాలిని సస్పెన్షన్ లో ఉన్న పాఠశాల ఉపాధ్యాయుడు కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని సందీప్ గా పోలీసులు గుర్తించారు. కాలి కాయంతో ఆస్పత్రికి వచ్చిన సందీప్ కు డాక్టర్ వందనా దాస్ వైద్యం చేస్తుండగా.. ఒక్కసారి కత్తెరతో దాడి చేశారు.ఉన్మాదిగా ప్రవర్తిస్తూ వందనాదాస్ ని పొడిచిపొడిచి చంపాడు.
The Kerala Story: వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఈ సినిమాపై నిషేధం విధించింది. ఇక తమిళనాడు ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో సినిమా ప్రదర్శనను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినిహాయింపులను కల్పించాయి. కొన్ని చోట్ల మహిళలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తున్నారు.
Vande Bharat: ప్రధాని ప్రతిష్టాపకంగా ప్రారంభించిన వందే భారత్ ట్రైన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మామూలు ట్రైన్లతో పోలిస్తే ఈ రైళ్ల ఆక్యుపెన్సీ భారీగా ఉంది.
Pawan Kalyan: కేరళలో జరిగిన బోటు ప్రమాదం విచారం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట్ బోల్తా పడ్డ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించిందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం…
పర్యాటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 21 మంది మరణించారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న హౌస్బోట్ బోల్తా పడి మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ ఫైల్స్ ’ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. విడుదలతో పాటే వివాదాలను కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించాయి. ఇదిలా ఉంటే శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమాను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళలో జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు ఇతివృత్తంగా సినిమాను రూపొందించినట్లు మూవీ మేకర్స్ వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఏకంగా.. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు.
The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభిస్తున్న వందేభారత్ రైళ్లపై వరుస దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోటు రాళ్లతో ఈ రైళ్ళ మీద ఆగంతకులు దాడులు చేస్తున్నే ఉన్నారు.
మే 5న విడుదలవుతున్న 'ది కేరళ స్టోరీ' చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకులు ఈ చిత్రాన్ని "ప్రచార చిత్రం" అని తీవ్రంగా విమర్శించారు.సోమవారం 'ది కేరళ స్టోరీ' మద్దతుదారులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం అయిన ముస్లిం యూత్ లీగ్ ఒక సవాల్ను విసిరింది.