Kerala: మటన్ తక్కువగా వడ్డీస్తున్నారని చెబుతూ ఏకంగా ఓ ఖైదీ జైలు అధికారులపైనే దాడి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. తనకు వడ్డించిన మటన్ కర్రీతో సంతృప్తి చెందకపోవడంతో వయనాడ్ కు చెందిన ఖైదీ ఫైజాస్ పూజపురా సెంట్రల్ జైలులో అధికారులపై దాడికి పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన ఇతడిని ప్రస్తుతం జైలులో అత్యంత భద్రతతో కూడిన సెల్ లో ఉంచారు.
Kerala: కేరళలో సంచలనం సృష్టించిన హోటల్ యజమాని హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెక్స్ స్కాండర్, హనీట్రాప్ ఈ కేసులో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కోజికోడ్ కు చెందిన వ్యాపారి హత్య కేసులో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. నిందితులు శిబిలి, ఫర్హానా, ఆషిక్ లు ముగ్గురు 58 ఏళ్ సిద్ధిక్ ను హనీట్రాప్ చేసేందుకు కుట్ర చేశారు
Arikomban: గత నెలలో కేరళలో విధ్వంస సృష్టించి వార్తల్లో నిలిచిన పోకిరి ఏనుగు ‘‘ అరికొంబన్’’ మళ్లీ దాడులను ప్రారంభించింది. కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించి అక్కడ దాడులకు పాల్పడుతోంది. తమిళానాడు తేనిలోకి ప్రవేశించి అక్కడ ప్రజలపై దాడులు చేసింది. ఇటీవల కేరళలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్ నుంచి పట్టుబడిని అరికొంబన్ ను పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలిపెట్టారు అటవీ అధికారులు.
Kerala: కేరళలో డ్రగ్స్ వినియోగం గురించి కొచ్చి పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందనే విషయాలను వెల్లడించారు. అన్ని స్థాయిల్లో ఉన్న పోలీస్ అధికారుల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస అవుతున్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ కే. సేతురామన్ అన్నారు
Kerala: కేరళలోని కన్నూర్‌లో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లోని ఉరిలో వేలాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
Jewish Wedding: 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేరళలో యూదు జంట పెళ్లి చేసుకుంది. గత 70 ఏళ్లలో ఇలా పెళ్లి చేసుకోవడం ఇది ఐదవది. ఆదివారం వివాహం జరిగింది. డేటా సైంటిస్ట్ రేచల్ బినోయ్ మాలాఖి అమెరికాలో నాసా ఇంజనీర్ రిచర్డ్ జాచరీ రోవ్‌ను వివాహం చేసుకున్నారు.
Train Reverse : బస్సులు, కార్లు రివర్స్ వెల్లడం చూశాం కానీ.. రైలు రివర్స్ వెళ్తుందని చాలా కొద్దిమంది మాత్రమే వినుంటారు.కేరళలోని షోరనూర్ వెళ్తున్న వేనాడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదవశాత్తు స్టాప్ దాటింది. రైలు ఒక కిలోమీటరు ముందుకు వెళ్ళింది. అప్పుడు లోకో పైలట్‌కి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది.
Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపడుతోంది.
Supreme Court: ఏదైనా ఒక ఇంటిని కానీ, ఇతర భవనాలను అమ్ముతున్న సమయంలో పాత విద్యుత్ బిల్లును విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడం చూస్తుంటాం. ఇది కొత్తగా వాటిని కొనుగోలు చేసిన యజమానులపై పడుతుంది. అయితే వారు వాడిన కరెంట్ కు మేం ఎలా బిల్లు కడుతాం అనే ప్రశ్న ఇటువంటి సందర్భాల్లో ఉద్భవిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.