Love Story: రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లను చూస్తే చాలు.. కామాంధులు అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. ప్రేమ పేరుతో అత్యాచారానికి ఒడిగడుతున్నారు.
కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో రావడంతో అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్ కు దారిచ్చేందుకు ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్సు సరైన దారిలోనే వచ్చింది.
Hand Chopping Case: 2010లో కేరళలో ఓ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఈ రోజు ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సంచలనాత్మకమైన ఈ కేసులో నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్న ఆరుగురిలో ముగ్గురికి కేరళలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.
కేరళ రాష్ట్రంలోని కోజీకోడ్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై ఎవరు కనిపిస్తే వారిని కరిచేస్తున్నాయి. నిన్న (ఆదివారం) ఈ కుక్కల గుంపు కనిపించిన వారిపై కనిపించినట్లుగా దాడి చేశాయి. దీంతో ఈ కుక్కలను అధికారులు అదుపులోకి తీసుకురాలేకపోయారు. దీంతో ఇవాళ (సోమవారం) ఆ ఏరియాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కుక్కల భయానికి కోజీకోడ్లోని కూతలి పంచాయత్ పరిధిలోని ఏడు పాఠశాలలు, 17 అంగన్వాడీలకూ నేడు సెలవు ఇచ్చారు.
గుడికి వెళ్లిన వారు.. దేవుడిని దర్శించుకున్న తరువాత గుడిలో పెట్టే ప్రసాదం తీసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గుడికి వెళ్లిన వారికి సాదారణంగా గుళ్లో ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, అటుకులు, బెల్లం, అరటిపండు ఇస్తారు.
Heavy Rains: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
Rare Brain Infection: అత్యంత అరుదుగా సోకే అమీబా ఇన్ఫెక్షన్ కేసు కేరళలో నమోదైంది. నీటిలో ఉండే అమీబా శరీరంలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఇన్ఫెక్షన్ కలుగుతుంది.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ 3 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
నైరుతి రుతుపవనాల నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని 2 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 10 జిలా్లలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లోని తీర ప్రాంతాల్లో రానున్న 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.