Love Story: రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లను చూస్తే చాలు.. కామాంధులు అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. ప్రేమ పేరుతో అత్యాచారానికి ఒడిగడుతున్నారు. నమ్మి వచ్చిన ప్రేయసిపై అఘ్యాయిత్యం చేసి రాక్షసంగా ఆమెను కోరిక తీర్చుకున్న ఘటన సంచలనంగా మారింది. ఓ మైనర్ బాలికపై ఆమె ప్రియుడు, అతని స్నేహితులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఎవరికి చెప్పుకోవాలో తెలియక దాదాపు ఏడాది పాటు తనలో తాను నరకం అనుభవించింది. ఈ ఘటన కేరళలోని అదూర్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Read also: Harish Shankar: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి బ్రేక్? ‘రైడ్’తో రెడీ?
అదూర్‌లో సుమేష్ అనే యువకుడు 17ఏళ్ల బాలికపై కన్నుపడింది. ఆమెను ఎలాగైన ప్రేమపేరుతో వంచించి తన కామాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. సుమేష్ తో పాటు అతని స్నేహితులు కూడా తోడయ్యారు. దీంతో పథకం ప్రకారం ఆబాలికను సుమేష్ ప్రేమలో దించాడు. ఆమెను ఓచోటుకు రావాలని కోరాడు. దీంతో సుమేష్ ను నమ్మిన ఆ బాలిక అతనితో వెళ్లింది. అయితే సుమేష్, తన ప్రెండ్స్ వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకరి తరువాత ఒకరు ఆమెపై కామ కోరికను తీర్చుకున్నారు. కాళ్లు పట్టుకుని వదలాలని వేడుకున్నా కనికరం లేకుండా ఆమెపై పడి మృగాళ్ల ప్రవర్తించారు. సుమేష్ కాపాడు అంటున్నా తన స్నేహితులను ఒక్కొరిని ఆమె పై అత్యాచారానికి వుసిగొల్పాడు. దీంతో ఆబాలిక ఏం చేయలేక పోయింది. మృగాళ్ల కోరికలను బలైంది. నమ్మి వచ్చిన ప్రేమికుడి చేతిలో మోసపోయింది. ఈ వ్యవహారం ఎవరికి చెప్పకూడదని చెప్తే చంపేస్తామని ఆ బాలికను వారు బెదిరించి ఇంటి దగ్గర వదిలేసారు. అంతే కాకుండా గత సంవత్సరం డిసెంబర్ లో ఈ ఘటన జరగగా ఇప్పటి వరకు ఆ బాలికను లైంగికంగా వేధిస్తూనే సుమేష్, తన స్నేహితులు సామూహిక అత్యాచారం చేస్తూ వచ్చారు. దీంతో విసిగి పోయాన ఆ బాలిక ఇంట్లో వున్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది.
Read also: Snake Bite: పాము కాటుకు చికిత్స త్వరగా అందడం లేదు.. ఏటా 60వేల మంది మృతి
వెంటనే బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడితో పాటు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 17 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రియుడు సుమేష్ (19), అతని స్నేహితులు శక్తి (18), అనుప్ (22), అభిజీత్ (20), అరవింద్ (28)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం పంపించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సామూహిక అత్యాచారం సహా నాలుగు కేసులు నమోదు చేశారు పోలీసులు. గతేడాది డిసెంబర్‌లో తొలి అత్యాచారం జరిగిందని బాధితురాలు తెలిపిందని పోలీసులు అన్నారు. తన ప్రియుడి స్నేహితుడు శక్తి తనపై అత్యాచారం చేశాడని ఆమె మొదట ఆరోపించింది. ఆ తర్వాత యువతి సన్నిహితుడైన అనూప్ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అనూప్, అభిజీత్, అరవింద్ అనే యువకులు తనను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జులై మొదటి వారంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Naga Chaitanya: ఒకేసారి ఇద్దరు హిట్ డైరెక్టర్స్ తో అక్కినేని హీరో…