కేరళ రాష్ట్రంలోని కోజీకోడ్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై ఎవరు కనిపిస్తే వారిని కరిచేస్తున్నాయి. నిన్న (ఆదివారం) ఈ కుక్కల గుంపు కనిపించిన వారిపై కనిపించినట్లుగా దాడి చేశాయి. దీంతో ఈ కుక్కలను అధికారులు అదుపులోకి తీసుకురాలేకపోయారు. దీంతో ఇవాళ (సోమవారం) ఆ ఏరియాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కుక్కల భయానికి కోజీకోడ్‌లోని కూతలి పంచాయత్ పరిధిలోని ఏడు పాఠశాలలు, 17 అంగన్వాడీలకూ నేడు సెలవు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం వీధి కుక్కలు దాడులు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Team India Practice: టీమిండియా కఠోర సాధన.. బాల్తో కాకుండా దానితో ప్రాక్టీస్
నిన్న(ఆదివారం) సాయంత్రం ఐదుగురిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇంటి నుంచి బయటకు పిల్లలను పంపించేందుకు స్థానికులు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా వంద రోజుల ఉపాధి హామీ కింద చేసే పనులనూ అధికారులు నిలిపి వేశారు. కూతలిలోని ఒకేషనల్ సెకండరీ స్కూల్, పైతోట్ ఎల్పీ స్కూల్, కల్లోడు ఎల్పీ స్కూల్, వెంగప్పట్ట యూపీ స్కూల్, కూతలి యూపీ స్కూల్, కల్లూరు కూతలి ఎంఎల్పీ స్కూల్‌కు సెలవులను ప్రకటించారు. గత నెల కన్నూర్‌లో కుక్క ఓ తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేయడం కలకలం రేపింది. అయితే.. మూడు కుక్కలు బాలికపై తీవ్రంగా దాడి చేశాయి. గార్డెన్‌లో ఆడుకుంటున్న బాలికపై దాడి చేసి అక్కడి నుంచి నోటితో కరుచుకుని లాక్కుపోయేందుకు ప్రయత్నం చేసాయి. ఆ బాలిక తలకు, పొట్టలో, తొడలు, చేతులకు కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also: KGF: అప్పుడు ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్.. దేశం దాటి మరీ