పూలు రైతుకు కాసుల పంటే.. ప్రతి కాలంలోను ఆదాయాన్ని ఇస్తుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు పూల సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు..అరళం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ శాఖ, గిరిజన పునరావాస అభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా బంతిపూలు, చెమంతి పూల సాగు ప్రారంభించారు. ఇక్కడ ఎక్కువగా జీడి, రబ్బరు, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. అయితే అడవి ఏనుగులు, ఇతర జంతువులు వాటిని ధ్వంసం చేయడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అయితే ప్రయోగాత్మకంగా సాగు చేసిన పూలు రైతులకు మంచి ఆదాయం తెచ్చి పెట్టడమే కాదు, అడవి జంతువులు కూడా ముట్టుకోవడం లేదు.. దీంతో వందల మంది ఈ పంటల ద్వారా ఆధాయాన్ని పొందుతున్నారు..అక్కడ పండగల సమయంలో పూల దిగుబడి వచ్చేలా రైతులు పండిస్తున్నారు.. ఇక ప్రభుత్వం కూడా పూల రైతులకు భరోసా కల్పిస్తున్నారు.. కేరళలో బంతి, చామంతి, జర్బెరా, మల్లె, గులాబీ పూల సాగు చేపట్టిన రైతులు ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నారు. పూల సాగులో చీడపీడలు కూడా తక్కువే. రసాయనాలు వాడటం తక్కువే..
ఇక ఆ ప్రాంతాల్లో వరదలు కూడా తక్కువే.. సారవంతమైన అన్ని రకాల నేలల్లో పూలసాగు చేయవచ్చు. కొన్ని రకాల పూలను ఒక్కసారి నాటుకుంటే సంవత్సరాల తరబడి దిగుబడినిస్తాయి. ఇది రైతులు అన్ని విధాలా కలసి వస్తుంది. పూల సాగును ప్రోత్సహించి రైతులకు అండగా నిలిచేందుకు కేరళ కన్నూర్ రైతులు ఫామ్ ఫ్లవర్ ప్రొడ్యూసర్స్ కో ఆపరేటివ్ సొసైటీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక్కడి పూలకు మంచి డిమాండ్ ఉంటుంది.. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు కూడా పూలు వస్తాయి.. ఇక ఇక్కడి రైతులు కూడా పూల సాగును చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..