Nipah Virus: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం చెలరేగింది. ఇద్దరికి నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో మూడు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం ఆరోగ్య అధికారులు కోరారు. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సహజీవనం చేస్తున్న జంట దారుణానికి పాల్పడింది. తమ ఇద్దరు నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టింది. సంవత్సరాల తరువాత వారి అవశేషాలను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి లొంగిపోయారు. 25 ఏళ్ల భవిన్ పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్కు చేరుకుని, ఇద్దరు నవజాత శిశువుల అవశేషాలను పోలీసులకు అప్పగించి తన నేరాన్ని అంగీకరించాడు.తాను, తన లివ్-ఇన్ పార్టనర్ అనిషా (22) పిల్లలు పుట్టిన వెంటనే వారిని పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.…
కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక రాబోయే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి.
Cargo Ship: కేరళలోని కన్నూర్ జిల్లాలోని అళిక్కల్ నుండి 44 నాటికల్ మైళ్ల దూరంలో సింగపూర్ కార్గో షిప్లో రెండో రోజు కూడా పేలుళ్లు కొనసాగుతుండటంతో పాటు భారీగా మంటలు చెలరేగుతున్నాయి.
Corona Virus: కరోనా వైరల్ మరోసారి దేశ ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 6 వేల 133 కు చేరుకుంది. అంతే కాదు, గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు.
Padmanabhaswamy Temple: కేరళలో రాజధాని తిరువనంతపురంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత ‘‘మహా కుంభాభిషేకం’’ జరిగింది. దీంతో ఆదివారం రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ పురాతన ఆలయంలో ఇటీవల దీర్ఘకాలిక పునర్నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది.
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Covid-19 Cases: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ (మంగళవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటింది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. కేంద్రం నియమించిన దౌత్య బృందానికి నాయకత్వం వహించారు. పాకిస్థాన్ వైఖరిని విదేశాల్లో ఎండగట్టేందుకు అధికార-ప్రతిపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపించింది. ఇక కాంగ్రెస్ను సంప్రదించకుండానే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ను కేంద్రం నియమించడంపై వివాదం చెలరేగింది.