Canada: కెనడాలోని మానిటోబాలో విమానాలు ఢీకొన్న ప్రమాదంలో 23 ఏళ్ల భారతీయ పైలట్ స్టూడెంట్ మరణించినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు. ఒక ఫ్లైయింగ్ స్కూల్ వద్ద రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని కేరళకు చెందిన శ్రీహరి సుకేష్గా గుర్తించారు. మృతుడు కొచ్చిలోని త్రిప్పునితురలోని స్టాట్యూ న్యూరోడ్ వాసి. Read Also: Chhangur Baba: హిందూ, సిక్కు మహిళల్ని ఇస్లాంలోకి మారిస్తే ఒక్కో రేటు.. ఛంగూర్…
Nimisha Priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం నిమిషా ప్రియా కేసు భారత సుప్రీంకోర్టుకు చేరింది. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు అంటే, జూలై 14న అత్యవసరంగా పిటిషన్ను విచారించనుంది.
సాధారణంగా ఓ చిన్న పాము కన్పిస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాము. నాగుపాము కనిపిస్తే.. భయంతో వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతాము. ఇక ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ‘కింగ్ కోబ్రా’ ఎదురుపడితే.. ఇంకేమన్నా ఉందా, పై ప్రాణాలు పైనే పోతాయ్. అలాంటి కింగ్ కోబ్రాను ఓ లేడీ ఆఫీసర్ చాలా ఈజీగా పట్టేశారు. అడుగు దూరంలో ఉన్నా, బుసలు కొడుతున్నా ఎలాంటి భయం లేకుండా పట్టుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని పెప్పరలో నివాస…
దశాబ్దాల క్రితం.. యుక్తవయసులో చేసిన నేరాలు అతడిని వెంటాడాయి. ఓ ప్రమాదంలో పెద్ద కుమారుడు చనిపోగా.. చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబం కూడా వరుస సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో మానసిక సంఘర్షణకు గురైన అతడు.. దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు చేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ రహస్యాన్ని దాచిపెట్టి బతకడం ఇక తన వల్ల కావడం లేదని, అపరాద భారాన్ని మోయలేకపోతున్నానని చెప్పాడు. Also Read:Allu Arjun : తెలుగువారంటే…
Nipah Virus: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం చెలరేగింది. ఇద్దరికి నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో మూడు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం ఆరోగ్య అధికారులు కోరారు. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సహజీవనం చేస్తున్న జంట దారుణానికి పాల్పడింది. తమ ఇద్దరు నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టింది. సంవత్సరాల తరువాత వారి అవశేషాలను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి లొంగిపోయారు. 25 ఏళ్ల భవిన్ పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్కు చేరుకుని, ఇద్దరు నవజాత శిశువుల అవశేషాలను పోలీసులకు అప్పగించి తన నేరాన్ని అంగీకరించాడు.తాను, తన లివ్-ఇన్ పార్టనర్ అనిషా (22) పిల్లలు పుట్టిన వెంటనే వారిని పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.…
కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక రాబోయే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి.
Cargo Ship: కేరళలోని కన్నూర్ జిల్లాలోని అళిక్కల్ నుండి 44 నాటికల్ మైళ్ల దూరంలో సింగపూర్ కార్గో షిప్లో రెండో రోజు కూడా పేలుళ్లు కొనసాగుతుండటంతో పాటు భారీగా మంటలు చెలరేగుతున్నాయి.
Corona Virus: కరోనా వైరల్ మరోసారి దేశ ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 6 వేల 133 కు చేరుకుంది. అంతే కాదు, గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు.