Cargo Ship: కేరళలోని కన్నూర్ జిల్లాలోని అళిక్కల్ నుండి 44 నాటికల్ మైళ్ల దూరంలో సింగపూర్ కార్గో షిప్‌లో రెండో రోజు కూడా పేలుళ్లు కొనసాగుతుండటంతో పాటు భారీగా మంటలు చెలరేగుతున్నాయి. సింగపూర్ నుంచి వచ్చిన ఈ కంటైనర్ నౌకలో మంటలు ఉహించని విధంగా వ్యాపిస్తున్నాయి. అయితే, ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ట్రై చేస్తున్నారు. అయినప్పటికి కంటైనర్ నౌకలో ఉన్న వివిధ కెమికల్ పదార్థాల మూలంగా పేలుళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో నాలుగు రెస్క్యూ బోట్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ.. మంటలు అదుపులోకి రావడం లేదని చెప్పుకొచ్చారు.
Read Also: Sonam Raghuwanshi: భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నా.. ప్రియుడికి మెసేజ్ పెట్టిన సోనమ్
అయితే, వసతి బ్లాక్‌కు ముందున్న మిడ్-షిప్ ప్రాంతం, కంటైనర్ బే నుంచి మంటలు చెలరేగుతున్నట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఈ రోజు (జూన్ 10న) తెలిపారు. కాగా, ఈ అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తునే ఉన్నారు. మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు సముద్ర ప్రహరి, సాచెట్ సముద్రంలో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో షిప్‌లో దట్టమైన పొగ వ్యాప్తి చెందడం కనిపిస్తుంది. కాగా, ఈ ప్రమాదంలో మొత్తం 18 మందిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 9, 2025
STORY | Fire, explosions persist aboard cargo ship off Kerala coast; Salvage ops underway
READ: https://t.co/VQuVTr06YG https://t.co/IcpptOQ9C5
— Press Trust of India (@PTI_News) June 10, 2025