ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు.. దీంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఇలానే చేసినట్లు అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని పెరుంకలలోని అనకొంబన్లో ఒక పాస్టర్ తన భార్యకు సోమవారం ఇంట్లోనే ప్రసవం చేయడంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. వైద్య సహాయం తీసుకోకుండా ఇంట్లోనే ప్రసవం చేయడం వలన…
కేరళలోని కొచ్చిలోని కెనరా బ్యాంక్ శాఖ వద్ద ఒక విచిత్రమైన నిరసన కనిపించింది. ఆఫీసు, క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలన్న ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు బయటకు వచ్చి గొడ్డు మాంసం, పరాఠాలు వడ్డిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కేరళలో బాధ్యతలు స్వీకరించిన బీహార్ స్థానికుడైన రీజినల్ మేనేజర్, కెనరా బ్యాంక్ క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) మొదట మేనేజర్ మానసిక వేధింపులు,…
కేరళలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆరోపణలు రాగానే ముందుగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. తాజాగా అతడిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.
Jackfruit: ‘‘పనస పండు’’ తిని వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఒకవేళ పోలీసులు ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్’’ టెస్ట్ నిర్వహిస్తే, మీరు మద్యం తాగకున్నా తాగినట్లు రీడింగ్ చూపించే అవకాశం ఉంది. కేరళకు చెందిన ఈ సంఘటనకు పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ముగ్గు
కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్.అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతానందన్ జీవితమంతా ప్రజా సేవకే అంకితం అయిపోయిందని.. కేరళ పురోగతికి జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం వీఎస్.అచ్చుతానందన్ (101) తుదిశ్వాస విడిచారు. సోమవారం తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. నిమిషా ఉరిశిక్ష అమలును వాయిదా వేసిన యెమెన్. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది భారత సర్కార్. హత్య కేసులో నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. జూలై 16, బుధవారం ఉరిశిక్ష అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆమె 2017 నుంచి యెమెన్లో జైలులో ఉంది. యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన…
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. తంపానూర్ పోలీస్ స్టేషన్కు ఈమెయిల్ ద్వారా బెదిరింపు సందేశం అందింది.