Civil Services Exam: అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఓ యువతి యూనియన్ పబ్లిక్ సర్వీస్(యూపీఎస్సీ) రాసి ర్యాంక్ సాధించింది. కండరాల కదలికను ప్రభావితం చేసే పట్టుకతో వచ్చే ‘‘సెరిబ్రమ్ పాల్సీ’’ అనే వ్యాధితో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని సారిక ఏకే అనే యువతి సివిల్స్ సాధించారు.
ఝార్ఖండ్‌లోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం మధ్య ‘హటియా ఎర్నాకుళం ధర్తీ ఎక్స్‌ప్రెస్’ రాకపోకలు కొనసాగిస్తుంది. ఆ రైలు బోర్డుపై ‘హటియా’ అనే పదాన్ని మలయాళంలో రాయకుండా దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. ఈ క్రమంలోనే హటియా కాస్తా ‘హత్య’గా మారిపోయింది.
Veterinary student Case: కేరళలో సంచలన సృష్టించిన వయనాడ్ వెటర్నరీ విద్యార్థి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ ప్రారంభించింది. వయనాడ్ జిల్లాలో ఓ కాలేజ్ హాస్టల్లో 20 ఏళ్ల సిద్ధార్థన్ ఫిబ్రవరి 18న హాస్టల్ బాత్రూమ్లో చనిపోయి కనిపించాడు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు.
The Kerala Story: గతేడాది వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళలోని మతమార్పిడిలు, తీవ్రవాద భావజాలం పెరుగుదల ఇతివృత్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.
థామస్ ఐజాక్ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట 9.6 లక్షల రూపాయల విలువ చేసే 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని ఎన్నికల సంఘానికి తెలిపారు.
కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న కే సురేంద్రన్‌పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు.