మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భయపడకుండా.. వారు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు కామాంధులు. తాజాగా.. కేరళలోని కన్నూర్‌లో ఓ మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకుని కేరళ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు ఇఫ్తికార్ అహ్మద్‌ను విస్మయ ఎంటర్టైన్మెంట్ పార్క్‌లో…
Oleander Flowers: కేరళలోని రెండు ప్రధాన దేవస్వామ్ బోర్డులైన ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డ్(టీడీబీ), మలబార్ దేవస్వోమ్ బోర్డ్‌ల పరిధిలోని అన్ని దేవాలయాలు ‘‘ఒలియాండర్ పూలను’’ నిషేధించాయి. అరళీ పూలు, ఎర్రగన్నేరు పూలుగా పిలిచే వాటిని ఆలయాల్లో పవిత్ర ఆచారాల్లో వినియోగించడాన్ని నిలిపేశాయి. మానవులు, జంతువులకు హాని కలిగించే ప్రమాదం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. గురువారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం తమ పరిధిలోని…
కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజన్స్ వెల్లడించింది.
మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని మరోసారి నిరుపించింది కేరళ కి చెందిన షీజా. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సాహసానికి ఒడిగట్టింది. పదుల అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తోంది.
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు జూన్ 4 న పట్టాలేక్కనుంది. కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది.
కేరళలోని దక్షిణ జిల్లా కొల్లాంలోని పరవూర్‌లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెకు విషపూరిత పదార్థం ఇచ్చి, ఆపై వారి గొంతులను కోసి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూతక్కుళానికి చెందిన 46 ఏళ్ల శ్రీజు అనే నిందితుడు తన పెద్ద కుమారుడు శ్రీరాగ్ (17) ను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, తరువాత అతని పొడిచి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పరవూర్ పోలీసులు తెలిపారు. నేడు ఉదయం తండ్రి, కొడుకు ఇద్దరూ తమ ఇంట్లో విషమ పరిస్థితిలో కనిపించారని,…
West Nile fever: కేరళలో కొత్త వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ‘వెస్ట్ నైలు ఫీవర్’’ అనే జ్వరం సోకుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేసులు నమోదైనట్లుగా కేరళ ఆరోగ్యమంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. కాసర్గోడ్లో అంబులెన్స్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు త్రిసూర్‌లోని ఇరింజలకుడాకు చెందిన శివకుమార్ (54), అతని కుమారులు శరత్ (23), సౌరవ్ (15)గా గుర్తించారు.