Pulwama attack: పుల్వామా దాడిపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. పుల్వామా ఘటన కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఆంటోఆంటోనీ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు 42 మంది జవాన్ల ప్రాణాలనున బలిగొందని ఆయన విలేకరులు సమావేశంలో అన్నారు. పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని చెప్పడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపింది. ప్రోటోకాల్ పరిగణలోకి తీసుకోకుండా, జవాన్లను ఉద్దేశపూర్వకంగా రోడ్డు మార్గం ద్వారా…
CM Pinarayi Vijayan: ఇటీవల కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ బీజేపీలో చేరారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ప్రభుత్వంలో ఉంటుందని, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాషాయ పార్టీలో పొత్తు పెట్టుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం త్రివేండ్రం జిల్లా ఎల్డీఎఫ్ ఎన్నికల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేరళలోని (Kerala) తిరువనంతపురం సముద్ర తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating bridge) తెగిపోవడంతో 15 మంది గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.
Kerala launches India’s first government-owned OTT platform CSpace: దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నడిపే ఓటీటీ ప్లాట్ఫారమ్ ‘సి స్పేస్’ను కేరళ సర్కార్ ప్రవేశపెట్టింది. తిరువనంతపురంలోని కైరలీ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘సి స్పేస్’ను ప్రారంభించారు. ఈ క్రమంలో మలయాళ సినిమా ఎదుగుదలకు ఇదో కీలకమైన ముందడుగు అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వేడుకకు సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ అధ్యక్షత వహించారు. జాతీయ అలాగే రాష్ట్ర అవార్డులు గెలుచుకున్న…
Kerala: కేరళలో వెటర్నరీ విద్యార్థి మరణం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వయనాడ్లోని వెటర్నరీ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న జేఎస్ సిద్ధార్థ్ ఫిబ్రవరి 18న కాలేజీ హాస్టల్లో ఉరేసుకుని మరణించాడు. అయితే, ఇది ఆత్మహత్య కాదని హత్య అని బాధితుడి కుటుంబం ఆరోపిస్తుంది. ఈ కేసులో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వర్సిటీ వైస్ఛాన్సలర్ని శనివారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో పోలసీులు 11 మందిని అరెస్ట్ చేశారు. సిద్ధార్థ్ మరణించడానికి ముందు ర్యాగింగ్ చేసి…
Gaganyaan: ప్రముఖ మలయాళ నటి లీనా తాను ‘గగన్యాన్’ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్యాన్’లో పాలుపంచుకుంటున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ప్రధాని ప్రకటన అనంతరం లీనా తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గగన్యాన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు. READ ALSO: Jio phone:…
Space station: 2035 నాటికి భారత్కి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని, ఇది అంతరిక్ష విషయాలను కనుగొనేందుకు, అధ్యయనం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు అన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారత వ్యోమగామని సొంత రాకెట్ ద్వారా చంద్రుడిపై దిగుతారని చెప్పారు.
PM Modi: కేరళలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. సీపీఎం వయనాడ్ లోక్సభ స్థానానికి అన్నీ రాజాను అభ్యర్థిగా పేర్కొన్న ఒక రోజు తర్వాత ప్రధాని ఈ రెండు పార్టీల తీరుపై మంగళవారం విమర్శలు గుప్పించారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ శత్రువులని, కానీ బయట BFF( బెస్ట్ ఫ్రండ్స్ ఫర్ఎమర్) అంటూ ఎద్దేవా చేశారు.
గగన్యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు.