Kerala: పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై యావత్ దేశం బాధపడుతుంటే, మరికొందరు మాత్రం ఈ ఘటనపై వివాదాస్పద కామెంట్స్, సోషల్ మీడియా పోస్టు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలాంటి సమయంలో సంయమనం, సంఘీభావం ప్రకటించాల్సింది పోయి, కొందరు తెలివి తక్కువ రాజకీయ నాయకులు రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు.
Read Also: Delhi: ఢిల్లీ కొత్త మేయర్‌గా బీజేపీ రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నిక..
తాజాగా, జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) స్థానిక నాయకుడు బషీర్ వెల్లికోత్ పై కేరళలోని కాసర్‌గోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లకు కారణమయ్యే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 192 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆ తర్వాత దీనిని వెల్లికోత్ డిలీట్ చేశారు. ఈ పోస్టులో పహల్గామ్ దాడి వెనక రాజకీయాలు ఉన్నాయని అన్నారు. వాటిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బషీర్ పుల్వామా దాడి నేపథ్యం కూడా ఇంకా వెలుగులోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ అశాంతిని ప్రేరేపించే అవకాశం ఉండటం, రెచ్చగొట్టే స్వభావం ఉండటంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీనికి ముందు, కర్ణాటకలో కూడా ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. మంగళూర్‌కి చెందిన ఓ సోషల్ మీడియా యూజర్ ‘‘నిచ్చు మంగళూర్’’ పేజీలో పహల్గామ్ దాడిని సమర్థించాడు. ప్రస్తుతం ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.