కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో నీటి సమస్యలు చాలా కీలకమన్నారు. కృష్ణ జలాల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా హాజరుకాకపోవడం ప్రజలను అవమనపరిచినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ రాకుండా బయట ఎక్కడో మాట్లాడ్డం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎంత సేపు మాట్లాడిన అవకాశం ఇస్తామని చెప్తున్న…
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.
నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫైరయ్యారు. నియోజకవర్గ పనుల కోసం బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తనను కలుస్తున్నారని.. సమస్యలు చెప్పుకోవడానికి ఎవరొచ్చినా కలుస్తామని రేవంత్రెడ్డి తెలిపారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరాడాలంటే ప్రధాని మోదీతో కొట్లాడాలన్నారు. రండి కలిసి కొట్లాడదం.. ప్రాజెక్టులు గుంజుకుంటే కలిసి కొట్లాడదమన్నారు. సన్ స్ట్రోక్ ఈ రాష్ట్రానికి తగలొద్దు అనుకుంటున్నా.. ఒక్కడి కోసం ఇంత మందిని బలి పెడుతున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కలవవచ్చు.. రండి కలిసి పునర్నూర్మిద్దామని సీఎం తెలిపారు.
తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే తమపై శాపనార్థాలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని.. రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామన్నారు. మరోవైపు.. రైతుబంధుపై పదే పదే మాట్లాడుతున్నారని.. గతంలో వారు ఎలా వేసారో గుర్తు చేసుకోవాలన్నారు. 2018-19లో యాసంగి పంటకు రైతుబంధు ఐదు నెలలకు వేశారు.. 2019-20లో 9 నెలలు, 2021-22 నాలుగు…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళలో కూడా అణచివేతలు.. ఆధిపత్య ధోరణి కొనసాగిందని ఆరోపించారు. అందుకే మార్పు కావాలని ప్రజలు చూశారని తెలిపారు. దురదృష్టవశాత్తు కేసీఆర్ ఇవాళ సభకు రాలేదు.. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్.. ఆయన మేధావితనంతో సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది అరి అన్నారు.…
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ, బడ్జెట్ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలిపారు.