బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్ కట్టామన్నారు. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే శ్రీశైలం కట్టామని ఆయన పేర్కొన్నారు. నీకు తెలియదు కాబట్టి కూలి పోయేలా కాళేశ్వరం కట్టావు కేసీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు…
దక్షిణ తెలంగాణ లీడర్లతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సంద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈనెల 13 న నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు… నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదంతా పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం తో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ లు ఆధీనం లోకి వెళితే తెలంగాణ…
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు.
హరీశ్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్లు నటించి వేరే వాళ్ల చావుకు కారణం కాలేదని, పోసుకుని చచ్చిపోతా అని నాటకాలు ఆడలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు అందరూ బ్లాక్ మైలర్స్ గా ఉన్నారని, ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తదన్నారు. తెలంగాణ రావడానికి మూల కారణం… ఆల్ పార్టీ లో కేంద్రాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. అవిషయం…
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఒక దిగజారుడు పార్టీ. వెకిలి చేష్టలతో వికృతానందం పొందుతుందన్నారు. ఓడిన వాళ్లపై దుష్ప్రచారం చేయడం కుసంస్కారమన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగై పోయిందన్నారు. కాంగ్రెస్కు ఎందుకు ఓటేసామని రెండు నెలల్లోనే ప్రజలు బాధపడే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన…
KRMB కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కార్కు లొంగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేసీఆరే చెప్పారని, కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి…
Big Breking: బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నెల 10న కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. నీ అయ్య ఎవడ్రా పడగొట్టేటోడు.. పడగొడతార్రా... ఎవడు కొట్టేది? అని దుయ్యబట్టారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం... ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తోన్న ప్రభుత్వం... ఇది ప్రజా ప్రభుత్వం.. వాడు అనుకుంటున్నాడు... లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని…
KCR: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.