KCR: త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 10 వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు,జనసమీకరణ,సభ విజయవంతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Read also: Peddireddy Ramachandra Reddy: ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు: పెద్దిరెడ్డి
మార్చి 10 వ తేదీన కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సన్నాహాలు చేపట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగుతుంది. చివరిసారిగా ఫిబ్రవరి 6 వ తేదీన కె.ఆర్.ఎం.బి సమావేశంలో ఐదు ఉమ్మడి జిల్లాల నేతలతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం జరిగింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు, జిల్లాలో పార్టీ నేతల పై పోలీస్ కేసులు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు. రేపు మహబూబ్ బాద్,ఖమ్మం పార్లమెంటు నేతలతో కేసీఆర్ భేటి కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కు రానున్నారు. మధ్నాహ్నం 2 నుంచి 3 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్, అనంతరం మధ్నాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు.
Read also: Ponnam Prabhakar: పిల్లలకి పోలియో చుక్కలను వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..
పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల వల్ల పరిస్థితి కాస్త టఫ్ గా తగ్గే ఛాన్స్ ఉంది. ఓటర్లు ఎక్కువగా జాతీయ పార్టీల ప్రభావంతో ఉన్నారు. గులాబీ పార్టీ ఏడెనిమిది సీట్లు గెలిస్తే మళ్లీ గాడిలో పడిపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా గులాబీ పార్టీ తరపున పోటీ చేసే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా వారి పేర్లను ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరోవైపు నేడు సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు భేటీ కావడంతో.. బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతుంది.
Transfer of Inspectors: భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. మొత్తం 104 మంది..